రెండు కుక్క పిల్లలకు పేచీ వచ్చింది, కానీ తల్లి భలే కంట్రోల్ చేసింది- వీడియో

స్పెషల్ డెస్క్ చిన్న పిల్లలు అన్నాక సహజంగానే పోట్లాడుతుంటారు. బొమ్మల విషయంలోనో, టీవీ విషయంలోనో.. లేక మరో విషయంలోనో పేచీలు పెట్టుకుంటారు. ఒకరిపై ఒకరు పేరెంట్స్ కు చాడీలు చెప్పుకుంటారు. ఇదంతా ప్రతి ఇంట్లో జరిగే తతంగమే. ఐతే పిల్లలు ఎంత పోట్లాడినా తల్లి మాత్రం భలే కంట్రోల్ చేస్తుంది. ఎవరు నొచ్చుకోకుండా కొంత కోపం ప్రదర్శిస్తూనే, పిల్లలను సైలెంట్ చేయడంలో అమ్మకు అమ్మే సాటి.

మరి అదే జంతువుల విషయంలో.. మరీ ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో ఇదే సందర్బం ఎలా ఉంటుంది. రెండు పప్పీస్ పోట్లాడుకుంటే ఎలా ఉంటుంది. పప్పీస్ ను తల్లి ఎలా కంట్రోల్ చేస్తుంది. వినడానికే భలే సరదాగా ఉంది కదా. మరి నిజంగానే కుక్క పిల్లలు పేచీలు పెట్టుకున్న సందర్బంలో తల్లి కుక్క వచ్చి ఎలా ఇద్దరిని బెదిరించి, సముదాయించిందో మీరే చూడాండి.

dogs 1

ఇదిగో ఇక్కడ రెండు పప్పీస్ ఆడుకుంటూన్నాయి. మరి అంతలో వాటికి ఏం అయ్యిందో తెలియదు కానీ, రెండు పోట్లాటకు దిగాయి. ఒకదానిపై ఒకటి అరుచుకుంటున్నాయి. వాటి భాషలో ఏం తిట్టుకుంటున్నాయో తెలియదు కానీ, పోట్లాడుకుంటున్నాయని మాత్రం అర్ధం అవుతోంది. ఇదిగో దాన్ని గమనించిన తల్లి వెంటనే రంగంలోకి దిగింది.

తన పిల్లలకు ముందు తల్లి కుక్క సర్ధి చెప్పేందుకు ప్రయత్నించింది. రెండు పప్పీస్ పోట్లాడుతుంటే, ఒకదాన్ని పక్కకు తీసుకువచ్చేందుకు ట్రై చేసింది. కానీ పప్పీస్ వింటే కదా. వాటి గొడవలో అవి ఉన్నాయి. దీంతో తల్లి కుక్క వాటిపై చిరు కోపం ప్రదర్శించింది. ఎందుకు ఊరికే పోట్లాడతారు.. అని రెండు పప్పీస్ పై మండిపడింది. దీంతో తల్లికి కోపం వచ్చిందని గ్రహించిన పప్పీస్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. చూడ్డానికి భలే ముద్దుగా ఉన్న ఈ వీడియోని ఇప్పటి వరకు రెండు కోట్ల మందికి పైగా చూశారు. మరి మీరు కూడా ఓసారి చూసి ఎంజాయ్ చేయండి.