ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా సజ్జనార్.. అధికారులు షాక్!

sajjanar bus

ఒకప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలంటే మహారాజు అతని పరివారం మారువేశాల్లో నగరంలో సంచరించి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని తమ పాలన కొనసాగించేవారు. ప్రజల ఇబ్బందులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే వారికి సరైన న్యాయం చేయగలుగుతాం అని కొన్ని సార్లు రాజకీయ నేతలు, అధికార్లు రంగంలోకి దిగుతుంటారు. ఇప్పుడు అలాంటి పని చేశారు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్.

saja minసజ్జనార్ ఎక్కడున్నా తనదైన మార్క్ చూపించారు. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉన్న సమయంలో నేరస్థులకు సింహ స్వప్నంగా ఉన్న ఆయన ఇప్పుడు టీఎస్ఆర్టీసీ లో తన సత్తా చాటేందుకు సిద్దమైయ్యారు. ఈ నేపథ్యంలో వీసీ సజ్జనార్ తాజాగా ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ట్రావెల్ చేశారు. తోటి ప్రయాణికులతో మాటలు కలిసి, వారి బాధలు సైతం అడిగి తెలుసుకున్నారు. కండక్టర్‌కు తానెవరో చెప్పకుండా టికెట్ తీసుకుని ఎంజీబీఎస్ వరకు బస్సులో ప్రయాణించారు.

తర్వాత ఎంజీబీఎస్ కు దిగి అక్కడ సాధారణ వ్యక్తిగా తిరుగుతూ బస్టాండు ప్రాంగణంలోని పరిశుభ్రతను పరిశీలించారు. ఏఏ ప్లాట్‌ఫాంలల్లో ఏఏ రూట్ బస్సులు వెళ్తాయో తెలిపే రూట్ బోర్డును, విచారణ కేంద్రం, రిజర్వేషన్ కేంద్రాల పనితీరును పరిశీలించారు. అక్కడ ఉన్న టాయిలెట్స్ ని చూసి శుభ్రంగా ఉంచాలని అక్కడి వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్కింగ్ స్థలంలో చాలా కాలంగా పేరుకుపోయిన వాహనాలను స్క్రాప్ యార్డ్‌కు తరలించాలని ఆదేశించారు. ప్రకటనల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి పార్కు నిర్వహణ బాధ్యతను ఔట్ సోరింగ్ ఏజెంట్లకు అప్పగించాలని సూచించారు.