సింహాన్నే భయపెట్టిన తాబేలు.. ఇది కథ కాదు నిజం.. వీడియో చూడండి

The turtle that scared the lion - Suman TV

చిన్నప్పుడు స్కూల్‌లో చదువుకున్నట్లు ఇది కుందేలు-తాబేలు కథ కాదు. నిజంగా జరగింది. అడవీ రాజు సింహం అని చదువుకున్నారం. దాని గర్జన వింటే ఏ జంతువుకైనా వణుకుపుట్టాల్సిందే. తన బలం ముందు ఏ జంతువైనా ఆహారంగా మారాల్సిందే. అలాంటి సింహాన్ని ఒక చిన్న తాబేలు ఎంతలా ఇబ్బంది పెట్టిందో తెలుసా? గుక్కెడు నీళ్లు తాగనీయకుండా.. ఇది నా చెరువు నువ్వు సింహం అయితే కావచ్చు కానీ నిన్ను నీళ్లు తాగనివ్వను అన్నట్లు సింహాన్ని నానా తిప్పలు పెట్టింది. ఓరి దీని ధైర్యం తగలెయ్యా.. ఈ బుడ్డదాంతో ఎందుకులే గొడవ అన్నట్లు సింహం పక్కకు వెళ్లి దాహం తీర్చుకుందాం అనుకుంటే అక్కడికి కూడా వచ్చి సింహాన్ని బెదిరించింది. ఈ తాబేలు ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘hayate_vahsh58’ అనే వ్యక్తి ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ తాబేలు డేరింగ్‌ ను మెచ్చుకుంటూ షేర్‌ చేస్తున్నారు. మరీ మీరూ ఓ లుక్కేయండి.