దేశీయ మార్కెట్లో స్థిరంగా బంగారం, వెండి ధరలు

బంగారం ధరలో మార్పు లేేదు

22 క్యారెట్ 10గ్రా బంగారం 44,500.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,550.
1కిలో వెండి 64,600బిజినెస్ డెస్క్-  ఈ రోజు మంగళవారం బంగారం ధరలో  పెద్దగా మార్పు లేదు. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 44 వేల 500 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 48 వేల 550 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధర కిలో 300 పెరిగింది. మార్కెట్లో వెండి కిలొ 64 వేల 600 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 960 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 1050 రూపాయలు పెరిగింది.

Gold 1 4
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 870 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,950 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,490 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48,490 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,560 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,990 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.