ఈ రోజు హైదరాబాద్ లో  స్వల్పంగా పెరిగిన  బంగారం, తటస్థంగా వెండి

స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 250 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 270 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,150.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,160.
1కిలో వెండి 65,800

బిజినెస్ డెస్క్- ఈ రోజు మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 25 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 27 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు పెరిగి 44 వేల 150 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 270 రూపాయలు పెరిగి 48 వేల 160 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధరలో మార్పు లేదు. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 65 వేల 800 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 640 రూపాయలు  పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 690 రూపాయలు పెరిగింది.

Gold 2 1

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 300 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,320 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 45 వేల 950 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46 వేల 950 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,060 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,260 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.