హైదరాబాద్ లో స్వల్పంగా తగ్గిన బంగారం ధర

భారీగా తగ్గిన వెండి ధర
10గ్రా 22 క్యారెట్ 90 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 100 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,950.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,040.
1కిలో వెండి 67,400

బిజినెస్ డెస్క్- ఈ రోజు సోమవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 9 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 10 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 90 రూపాయలు తగ్గి 44 వేల 950 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గి 49 వేల 040 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 400 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 67 వేల 600 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 800 రూపాయలు  తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 870 రూపాయలు తగ్గింది.

Gold 1
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 380 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,505 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,310 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48,310 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,100 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,380 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.