అప్ డేట్స్ లేవంటోన్న మహేశ్ టీం – అప్ సెట్ అవుతోన్న అభిమానులు!..

‘సర్కారు వారి పాట’ సినిమాను గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందే ప్రకటించారు. కానీ, అప్పుడే దీన్ని ప్రారంభించడానికి వీలు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జనవరిలో మొదటి షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. దుబాయ్‌లో జరిగిన ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే, అంతలోనే కరోనా కారణంగా మళ్లీ వాయిదా వేశారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31 తేదీన ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి ఏదైనా సర్‌ప్రైజ్ ఉండబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ సినిమా నుంచి వచ్చేది టీజర్‌ అని బాగా టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో మహేశ్ బాబు మూవీ నుంచి పోస్టర్‌గానీ, పాట గానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మహేశ్ బాబు టీమ్ పేరిట తాజాగా ఓ ప్రకటన బయటకు వచ్చింది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అభిమానులకు నిరాశ ఎదురయ్యింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులు ఎంతో కాలం నుంచి ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని మే 31న ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసే అవకాశాలున్నాయని ఎంతోకాలం నుంచి అందరూ చెప్పుకుంటున్నారు.

73071167

కాగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రీత్యా మహేశ్‌ తదుపరి చిత్రాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదని మహేశ్‌బాబు టీమ్‌ ట్వీటర్‌ వేదికగా వెల్లడించింది. దీంతో అభిమానులు కాసింత నిరాశకు గురయ్యారు. ఇందులో ‘ప్రస్తుత పరిస్థితులు బాగోలేని కారణంగా సర్కారు వారి పాట నుంచి ఎటువంటి అప్‌డేట్ రావట్లేదు. మా పేరిట వచ్చే ఏ అప్‌డేట్‌నూ నమ్మకండి. ఏదైనా ఉంటే మా అధికారిక ఖాతాల ద్వారానే వెల్లడిస్తాం. అలాగే, మే 31నే బీఏ రాజు గారి 11వ రోజు కూడా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించబోతున్న సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్ మాత్రం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, అదే రోజున ఈ సినిమా టైటిల్ లోగో విడుదల అవబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.