బిడ్డలపై తల్లికి ఉండే ప్రేమ వెలకట్టలేనిది. బిడ్డకు చిన్న గాయమైన భరించలేదు తల్లి. అయితే నేటికాలంలో అమ్మకు అన్నం పెట్టకుండా హింసించే కుమారులు ఎక్కువయ్యారు. తను తిన్నకుండా బిడ్డలకు అన్నం పెడితే. అదే బిడ్డలు ఇప్పుడు వారు తింటూ ఆమెను ఆకలితో అలమటించేలా చేస్తున్నారు. ఇలాంటి పుత్రరత్నాలు ఉన్నకాలంలో కూడా అమ్మ ప్రేమ దక్కలేదని ఇద్దరు కుమారుల దారుణానికి పాల్పడ్డారు. తల్లి మృతిని తట్టుకోలేక తీవ్రమానసిక వ్యధతో ఆ అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరబాద్ లోని కీసర పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిదాయారా గ్రామానికి చెందిన సుశీలకు ముగ్గురు కుమారులు. ఆమె భర్త మరో వివాహం చేసుకొని ఇంటి నుంచి వెళ్లి పోవడంతో తన ముగ్గురు కుమారులతో కలసి ఉంటోంది. ఇటీవల పెద్ద కుమారుడు మాధవరెడ్డకి వివాహం కాగా అతని భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. అతని సోదరులు యాదిరెడ్డి(30) ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, మహిపాల్‌రెడ్డి (28) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ సంగీత పాఠశాలలో పని చేస్తున్నాడు. వారానికోసారి తల్లి వద్దకు వచ్చివెళ్లేవారు. కాగా, వీరి తల్లి సుశీల తొమ్మిది నెలల క్రితం క్యాన్సర్ వ్యాధితో మృతిచెందింది. అప్పట్నుంచి అన్నదమ్ముళ్లు ఇద్దరూ తీవ్ర మనో వేదనకు గురవుతూనే ఉన్నారు. అమ్మ ప్రేమ లేకపోవడంతో.. ఎంతో కోల్పోతున్నామని తోటివారితో తమ వేదన వ్యక్తం చేశారు
. ఈక్రమంలో తల్లి చనిపోయిన తర్వాత ఇంటిని వదిలేసి ఇద్దరు సోదరులు దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లిపోయారు. అయితే తమ తల్లి ఉన్న ఇంటిని శుభ్రం చేసేందుకు ఈనెల 21న రాంపల్లిదాయరకి వెళ్లారు. అయితే గండిపేటలో ఉన్న పెద్ద అన్న మాధవరెడ్డి.. తన సోదరులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో పొరిగింటి వారికి ఫోన్ చేసి చేశాడు. దీంతో వారు వెళ్లి కిటికిలో నుంచి చూడగా యాదిరెడ్డి ఫ్యాన్ కు ఉరివేసుకొని, మహిపాల్ రెడ్డి పురుగుల మందుతాగి కిందపడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు ఇంట్లో మృతులు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో తమ తల్లి చనిపోవడం తట్టుకోలేక మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకుంటున్నామని, తమ చావులకు ఎవరు కారణం కాదని రాసి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసును కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.