పవన్‌ కల్యాణ్‌ని తెగ మెచ్చుకున్న గవర్నర్‌ తమిళిసై

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్. కేవలం నటుడిగానే కాకుండా జనసేన పార్టీ స్థాపించి ప్రజల పక్షాన ప్రశ్నిస్తా అంటూ ముందుకు వచ్చారు. అయితే ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో ప‌వ‌న్ కల్యాణ్ పార్టీ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు.. స్వయంగా పవన్ పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి చిత్రం తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాన్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ లో పింక్ రిమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ సూపర్ హిట్ అందుకొంది.

pawan1 compressedప్రస్తుతం ప‌వ‌న్ కల్యాణ్ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాన్ ‘బీమ్లా నాయక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సాగ‌ర్ కె చంద్ర దర్శకత్వంలో.. మాట‌ల మాంత్రికుడు ద‌ర్శ‌కుడు త్రివ్రిక‌మ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌తో వ‌స్తున్న బీమ్లా నాయ‌క్‌కు ఇప్ప‌టికే మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రానికి త‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దుమ్మురేపుతుంది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు నిత్యామీన‌న్ న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రానా ద‌గ్గుబాటి కూడా ప్ర‌ముఖ పాత్ర‌లో ఈ సినిమాలో న‌టిస్తున్నారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ లో కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య పాటకు మంచి స్పందన వచ్చింది.

పవన్ కళ్యాన్.. మొగులయ్యకు ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే.  ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ చాలా డిఫ‌రెంట్ గా ఆలోచిస్తారు… డిఫెరెంట్ గా న‌డుచుకుంటారు. అదే ఆయ‌న్ని అంద‌రికీ అభిమాన హీరోగా మార్చేస్తుంది.  ఆ కోవ‌లోకి ఫ్యాన్స్ నే కాదు… రాజ‌కీయ పెద్ద‌లు కూడా చేరిపోతున్నారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను తెలంగాణ గవర్నర్‌ తమిళి సై అభినందించారు. సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు పవన్‌ కల్యాణ్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అభినందించారు. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.