తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న శోభను.. డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తన సతీమణి శోభను చూసేందుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు వస్తున్నారట. ఈ నేపథ్యంలో యశోద హాస్పిటల్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మార్చి ఆరంభంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెగెలిసిందే. నీరసంగా ఉండడం, ఎడమ చేయి లాగుతోందని సీఎం చెప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు యశోద హాస్పిటల్‌లో చేర్పించారు. యశోద ఆస్పత్రి డాక్టర్లు సీఎంకు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. ఒక్క రోజు అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.