సిద్దిపేట జిల్లా కలెక్టర్ రాజీనామా..

siddipet collector venkatram reddy

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఉన్న వెంకట్రామి రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర  ప్రధాన కార్యాదర్శి సోమశేఖర్ కుమార్ కు అందజేశారు. పి.వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా  ఓదేల మండలం ఇందుర్తి గ్రామం.

గతంలో.. యాసంగిలో వరిపంట వేయవద్దని, ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేయాలని రైతులకు సూచించారు. రైతులు ఇతర పంటలు వేసే విషయం మండల అధికారులు చూసుకోవాలని, సీడ్ డీలర్లు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వెంకట్రామి రెడ్డి చేసిన వాఖ్యలు  వివాదస్పందంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకొని ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే  ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవాళ వెంకట్రామి రెడ్డి సచివాలయానికి చేరుకోవడంతో రాజీనామా చేస్తారని అనుమానాలు వచ్చాయి. అనుకున్నట్లుగానే తన రాజీనామా లేఖను రాష్ట్ర సీఎస్‌ కు అందజేశారు. వెంకట్రామిరెడ్డి రాజీనామా వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్‌ లో చేరుతారని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.