మేడారం భక్తులకు శుభవార్త!

సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహా సమ్మేళం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. మేడారం జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారం వెళ్ళే సమ్మక్క, సారలమ్మ భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

image 0 compressed 52నేటి నుంచి మేడారానికి ప్రత్యేకంగా బస్సులను నడపనుంది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి ఛార్జీలు పెద్దలకి రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. 

ఇది చదవండి : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌

image 2 compressed 27బస్సుల్లో ప్రయాణించే అమ్మవారి భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని ప్రయాణీకులకు ఆయన ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి రెండేళ్ళకి ఒకసారి జరుపుకునే ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లను ఘనంగా చేస్తోంది.