పేపర్ వేస్తే తప్పేంటి? వైరల్ అవుతున్న పదేళ్ల పేపర్ బాయ్ వీడియో

KTR Praising a Great Paper Boy in Hyderabad - Suman TV

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అన్నాడు ఓ సినీ కవి. ఆ జీవిత సత్యాన్ని చిన్న తనంలోనే బుర్రకి ఎక్కించుకున్నాడు ఓ చిన్నారి. తన కష్టాన్ని తాను నమ్ముకుని, జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని తహతహలాడుతున్నాడు. ఆ కుర్రాడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణలో జగిత్యాల టౌన్ లో ప్రకాశ్ అనే పదేళ్ల కుర్రాడు అతను. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉంటాడు. కానీ.., ఉదయాన్నే లేచి పేపర్ బాయ్ గా ఇంటి ఇంటికి పేపర్ వేస్తూ ఉంటాడు. ఇంట్లో ఉన్న ఆర్ధిక పరిస్థితులు తన ఆశయాలకి అడ్డు కాకూదనే ప్రకాశ్ ఇలా కష్టపడుతుంటాడు. అయితే.., తాజాగా ఓ వ్యక్తి ప్రకాశ్ పేపర్ వేస్తున్న వీడియోని చిత్రీకరించాడు.

KTR Praising a Great Paper Boy in Hyderabad - Suman TVఫోన్ రికార్డింగ్ లోనే ఉంచి.., ప్రకాశ్ ని పలకరించాడు. ఎందుకు పేపర్ వేస్తున్నావు అని ఆ వ్యక్తి ప్రశ్నించగా.. ” ఏమి పేపర్ వేస్తే తప్పు ఏంటి అంటా దైర్యంగా సమాధానం చెప్పాడు ప్రకాశ్”. మరి.. చదువుకోవడం లేదా అని ప్రశ్నించగా.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాను. చదువుకుంటూనే, పని చేసుకుంటున్నా అంటూ గర్వంగా సమాధానం చెప్పాడు ఈ జిగిత్యాల పిల్లడు. తరువాత ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయ్యింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా తన ట్విట్టర్ పేజ్ లో ఇక ఈ వీడియోని పోస్ట్ చేయడం విశేషం. మరి.. జీవితం పట్ల క్లారిటీ, నమ్మకం, సంకల్పతో ముందుకి వెళ్తున్న ఈ చిన్నారి విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.