నిందితుడు రాజు కోసం పబ్లిక్ వెతుకులాట!

తెలంగాణ సహా మొత్తం దేశాన్నే కుదిపేసిన వార్త సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం. విన్న ప్రతిఒక్కరి రక్తం మరిగిపోతోంది. ఇప్పటికీ ఆ నిందుతుడు బయటే ఉన్నాడు. నిందితుడు రాజు ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షలు నగదు బహుమతి ఇస్తానని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అందరూ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అందరి డిమాండ్‌ ఒక్కటే నిందితుడికి తగిన శిక్ష పడాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అందులో సామాన్యులు కూడా భాగస్వాములవుతున్నారు.

హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో చాలా మంది కార్యాలయాల్లో సెలవులు కావాలని కోరుతున్నారు. మాకు ఒక వారంరోజులు సెలువులు ఇవ్వండి ఆ దుర్మార్గుడు రాజుని పట్టుకొస్తామంటూ అర్జీలు పెడుతున్నారంట. ఇదంతా పేరు ప్రఖ్యాతలు, ప్రకటించిన నగదు రివార్డు కోసం కాదు. అలాంటి నీఛులు ఈ సమాజంలో ఉండకూడదంటూ ప్రజలు మండిపడుతున్నారు. తమకు కచ్చితంగా సెలవు మంజూరు చేయాలని చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులు కోరుతున్నారు. ఆ దుర్మార్గుడు త్వరగా దొరకాలి ఆ కుటుంబానికి న్యాయం జరగడంలో తమవంతు సాయం చేస్తామంటు ఎంతో మంది ముందుకొస్తున్నారు.