నేటి అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు ఆటోలు, క్యాబ్‌లు, లారీల సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ల ను నిలుపుదోపిడీ చేస్తోందని డ్రైవర్స్ జేఏసీ మండిపడుతోంది. ప్రభుత్వం న్యూమోటర్ వెహికల్ చట్టం 2019ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు వాహనాల బంద్‌కు పిలుపునిచ్చారు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు. అసలే గిరాకీలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయంటే… ఫిట్‌నెస్ లేట్ ఫీజు పేరుతో వాహనదారులపై రోజుకు రూ. 50 వసూలు చేయడంపై ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vishwak Sen: డ్రీమ్ కారు కొన్న విశ్వక్ సేన్.. ఆ కారు నాదేనంటూ డైరెక్టర్ కామెంట్!
వెహికల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఈఎంఐలు విపరీతంగా పెరిగిపోయాయి.. వాటితోపాటు పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలతో ఎంతో భారంగా వాహనాలు నడుపుతున్నామని.. ఇలాంటి తరుణంలో నూతన మోటర్ వాహనాల చట్టం తీసుకు వచ్చి మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ.. గురువారం ట్రాన్స్‌పోర్టు భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. రేపు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రవాణాశాఖ కార్యాలయం వరకు డ్రైవర్ల యూనియన్ జేఏసీ ర్యాలీగా వెళ్లి తమ నిరసన తెలియజేస్తామని జేఏసీ నేతలు పేర్కొన్నారు. అనంతరం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయం ముందు ధర్నా చేపడుతామన్నారు. ధర్నాలో ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీలతో పాటు అన్ని లారీ, క్యాబ్, ఆటో యూనియన్లు పాల్గొంటాయని తెలిపారు.
ఇదీ చదవండి:మరో KGFలా నెల్లూరులోని ఉదయగిరి! 2000 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు!
కరోనా కష్టకాలం తరువాత ఉపాధి కోల్పోయి అప్పులు పాలైన డ్రైవర్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే ప్రభుత్వం ఈ మాదిరిగా కొత్త చట్టాల పేరుతో తమ దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం న్యాయం కాదని తమగోడు వెళ్లబుచ్చుతున్నారు. ఒక్కోరోజు ఆటో, క్యాబ్ డ్రైవర్ల బంద్ కారణంగా బుధవారం అర్ధరాత్రి నుంచి సిటీలో ఎలాంటి క్యాబ్స్, ఆటోలు, లారీలు అందుబాటులో ఉండవు. కాబట్టి నగరపౌరులు, హైదరాబాద్ జంటనగరాల ప్రజలు దూర ప్రయాణాలు,వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.