‘హిందూ- ముస్లిం భాయీభాయీ’.. మనదేశంలో సుపరిచితమైన నానుడి… మత సామరస్యానికి మన దేశం ప్రతీకగా నిలుస్తోంది. ఓ ముస్లిం కుటుంబం పెద్ద మనసు చేసుకొని మత సామరస్యాన్ని చాటుకున్నారు. పదిమందికి పనికొచ్చే పనిచేయడానికి ఏ మతమూ అడ్డురాదని ఆ ఇంటి పెద్ద నిరూపించారు. తన సొంత డబ్బులతో పాటు చందాలు పోగుచేసి తన గ్రామంలోని హిందువుల కోసం రాముల వారి గుడిని నిర్మించారు. తెలంగాణ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో మతసామరస్యం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామ సర్పంచ్ అయిన షేక్ మీరాసాహెబ్ కు చిన్నప్పటినుంచి హిందూ మత ఆచారాలు, సంస్కృతి అంటే ఎంతో గౌరవం. ఈ క్రమంలో ఆయన సొంత డబ్బు రూ.25 లక్షలతో ఊరిలో రామాలయాన్ని నిర్మించాలని తలంచారు. అనుకున్నదే తడువుగా పనిని ప్రారంభించారు. షేక్ మీరాసాహెబ్ చేస్తున్న మంచి పనికి తమకు తోచినంత విరాళం ఇచ్చారు గ్రామస్థులు. మొత్తానికి షేక్ మీరాసాహెబ్ కల నెరవేరింది.. ఆయన తలపెట్టిన గుడి నిర్మాణం పూర్తయింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు సైతం షేక్ మీరాసాహెబ్ ని ఎంతో గొప్పగా మెచ్చుకుంటున్నారు.
తెలంగాణలో అన్ని మతాలు భిన్నత్వంలో ఏకత్వం అన్నదానికి ఇదే రుజువు అంటూ.. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. ‘ఇదీ తెలంగాణ అంటే.. ఇలాంటి కథనాలు మనం పంచుకోవాలని’ అంటూ కామెంట్ చేశారు. ఇటీవల బీహార్ లో ‘విరాట్ రామాయణ మందిర్’ నిర్మాణం కోసం రూ. 2.5 కోట్లు విలువచేసే భూమిని విరాళంగా ఇచ్చిందో ముస్లిం కుటుంబం. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This is Telangana!
The stories we should be sharing!
Shaikh Meera Saheb, Sarpanch of Boodidampaadu village in Telangana constructs Lord Ram temple with Rs 25 Lakhs of his own money. pic.twitter.com/n8Bi9GcLQB
— Konatham Dileep (@KonathamDileep) June 20, 2022