సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి బైక్ రేసర్ సందీప్ చెప్పిన అసలు కారణాలు

మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 7.30 ప్రాంతంలో మాదాపూర్లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్పై నుంచి అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోయాడు. దీంతో సాయిధరమ్ తేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రమాదం తర్వాత తెరపైకి ఎన్నో కథనాలు వచ్చాయి. తాజాగా రేసింగ్ బైక్ వల్ల అనీ కొందరూ ఓవర్ స్పీడ్ వల్ల అనీ కొందరూ అంటున్నారు. అయితే ఇంటర్నేషనల్ బైక్ రేసర్ సందీప్ నడింపల్లి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. హై ఎండ్ బైక్స్ మన రోడ్లకు సరిపోతాయా.. ఏ సీసీ వరకు వాడితో బెటర్ అన్న ప్రశ్నకు సమాధానంగా తేజ్ వాడుతున్న బైక్ న్యూస్లో 1001 సీసీ అని అంటున్నారు.. కానీ ఆయన వాడింది 700 సీసీ బైకే అని సందీప్ క్లారిటీ ఇచ్చారు.

SANDEEP min 1బండి ఏదైనా కానివ్వండి ఈయన డ్రైవ్ చేస్తున్న సమయంలో ఓవర్ స్పీడ్లో అస్సలు లేరని.. అక్కడ రోడ్ కండీషన్ బాగాలేదు.. వర్షాల వల్లో లేదా ఇతర కారణాల వల్లనో అక్కడ చాలా ఇసుక ఉంది. అక్కడ జారిపోయే ఆస్కారాలు చాలా ఉంటాయని అన్నారు. అంతేకాదు నేను వేరే రిపోర్ట్లో చూశానని.. టైర్స్ అరిగిపోయి ఉన్నాయని.. రక రకాల కారణాలు చెప్పారు. కానీ, ఆ బైక్ టైర్లు అలాగే ఉంటాయి.. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అది రేస్ మిషన్ కాదు.. స్ట్రీట్ ట్రిపుల్.. ఇది ఎక్కడి రోడ్లపై అయినా తిరగొచ్చు అన్నారు. అది డేంజరస్ బైక్ కాదు.. ఆయన కూడా డేంజరస్ స్పీడ్లో వెళ్లలేదు. ఆయన వాడేది ఏజీవీ హెల్మెట్ అది స్నెల్ సర్టిఫైడ్. యురోపియన్ మరియు డివోటి సర్టిఫైడ్ అని అన్నారు.

యాక్సిడెంట్ అయిన తర్వాత స్పోర్ట్స్ బైక్ గురించి రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాయి ధరమ్ మంచి వ్యక్తి ఇలాంటి సమయంలో బైక్స్ గురించి చెక్ చేస్తున్నారు.. బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా ఫీల్ అయ్యే విషయం అన్నారు. సాయి ధరమ్ బైక్ రైడింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే వ్యక్తి అని.. మాకు కూడా జాగ్రత్తలు చెప్పేవాడని అన్నారు. ఆయన స్పీడ్ గా వెళ్లి పడ్డారని రూమర్లు వస్తున్నాయి. కానీ నాకు తెలుసు ఎంత స్పీడ్లో వెళ్తే పడతామో. నేను చాలా సార్లు పడ్డాను. ఆ బాధ నాకు తెలుసు అన్నారు. రెండు రకాలుగా కేసు నమోదు చేశారని.. ఒకటి ఓవర్ స్పీడ్.. డేంజర్ రైడ్ అని ఉంది. కానీ ఆ రెండూ ఆయన చేయడం లేదని నా అభిప్రాయం అన్నారు. అసలు నా ఉద్దేశంలో అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపాలటీపై కేసు వేయాలనేది నా అభిప్రాయం అన్నారు.