సైదాబాద్‌ ఘటనలో నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానన్న ఆర్పీ పట్నాయక్‌!!.

RP Patnaik will be rewarded if he reveals the whereabouts of the accused in the Saidabad incident - Suman TV

సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడిని ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ మేరకు  ఓ పోస్టు పెట్టారు. చిన్నారికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాంటే నిందితుడు దొరకాలి. సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితుడు రాజు దొరకాలి. అతడి ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. పట్టించిన వారికి నా వంతుగా రూ.50 వేలు ఇస్తాను. అతడు దొరకాలి.  ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీసు శాఖకు మన వంతు సాయం అందిద్దాం’ అని ఆర్పీ పట్నాయక్‌ తెలిపారు.

If the accused is caught a reward of Rs 10 lakh - Suman TVమరోవైపు సైదాబాద్‌ ఘటన పట్ల పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. రాజుని పట్టుకోవడంలో పోలీస్‌ శాఖకు సాయం చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. మహేశ్‌బాబు, నాని ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.  మొన్ననే ఆర్పీ పోస్ట్ చేసిన  కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘యాక్సిడెంట్‌ విషయంలో అతి వేగంగా కేసు నమోదు చేసిన పోలీసులు – అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ చర్యల వల్ల నగరంలో మిగతా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. సదరు కంపెనీపై ప్రభుత్వం లక్ష జరిమానా కూడా విధించడం మనం చూసాం.

ఆర్పీ పట్నాయక్ ఇన్ స్టాలో పోస్ట్ :

 

View this post on Instagram

 

A post shared by Rp Patnaik (@rp.patnaik)