ట్రైన్ లేట్ కారణంగా ఇబ్బంది పడ్డారా? అయితే కోర్టులో కేసు వేసి పరిహారం పొందండి

Troubled due to train late - Suman TV

రైల్లో ప్రయాణించి టైంకి గమ్యస్థానానికి చేరుకుంటామని ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. దాదాపు ప్రతి ట్రైను ఆలస్యంగా రావడమో, చేరడమో జరగడం సహజమైపోయింది. ఆ ఆలస్యానికి మనం కూడా అలవాటు పడిపోయాం. రైళ్లలో ప్రయాణించిన మనలో చాలా మంది ఈ ట్రైన్లు ఇంతలే అని సరిపెట్టుకున్నాం. కానీ ఒక వ్యక్తి మాత్రం అలా ఊరుకోలేదు. రైలు ఆలస్యం కారణంగా తనకు జరిగిన నష్టానికి మన దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కాడు. ప్రతిఫలంగా రూ.30వేల పరిహారం పొందాడు.
Troubled due to train late - Suman TVవివరాల్లోకి వెళ్తే.. కశ్మీర్‌కు చెందిన సంజయ్‌ శుక్లా అనే వ్యక్తి జమ్మూ నుంచి శ్రీనగర్‌కు విమానం ద్వారా ప్రయాణించాలి. అందుకోసం టికెట్ బుక్‌ చేసుకున్నాడు. ఈ విమానం అందుకోవాలంటే మధ్యాహ్నం 12 గంటలకు జమ్మూ విమానాశ్రయాన్ని చేరుకోవాలి. కానీ అతను ఎక్కిన రైలు ఉదయం 8.10 గంటలకు జమ్మూకు రావాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం 12 గంటలకు గానీ ఆ రైలు చేరుకోలేదు. దీంతో సంజయ్‌ శుక్లా తన విమానం మిస్‌ అయ్యాడు. దీంతో దాదాపు రూ.15000 చెల్లించి ప్రత్యేక కారులో ప్రయాణించి శ్రీనగర్‌కు చేరుకున్నాడు. వేళ కాని వేళ చేరుకోవడం వల్ల అక్కడ హోటల్‌లో బస చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన జూన్‌ 11, 2016లో జరిగింది. రైలు ఆలస్యం వల్ల తనకు కలిగిన నష్టంపై ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సుప్రీం కోర్టు విచారించి ప్రయాణికుడికి భారతీయ రైల్వే రూ.30వేలు పరహారం చెల్లించాలని ఆదేశించింది.
ఆలస్యంపై సుప్రీం సీరియస్..
రైళ్లు ఆలస్యంగా నడపడం భారతీయ రైల్వేస్ కు అలవాటుగా మారిపోయిందని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియన్ రైల్వేస్ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పోటీతత్వం ఉండాలని సూచించింది. ప్రయాణికులు అధికారుల దయతో ప్రయాణం చేయడం లేదని హెచ్చరించింది.