శివశంకర్ మాస్టర్ కి అండగా సోనూసూద్! నేనున్నాను అంటూ పోస్ట్!

Sonu Sood Helping to Siva Shanker Master - Suman TV

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకుకి కూడా కరోనా సోకి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇక వీళ్లతో పాటు శివ శంకర్ మాస్టర్ భార్య కూడా కరోనాతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు.

అయితే ..,శివ శంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమవుతోంది. రోజుకు లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు అవుతోంది. ప్రస్తుతం మాస్టర్ కుటుంబం దగ్గర అంత ఆర్థిక స్థోమత కూడా లేనట్టు తెలుస్తుంది. శివ శంకర్ మాస్టర్ కొడుకు ఇప్పటికే దాతల సహాయాన్ని అర్ధించారు. దీంతో.. ప్రభుత్వాలు, పరిశ్రమ వర్గాలు మాస్టర్ ని ఆదుకోవాలన్న డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ.., ఇంతలోనే శివ శంకర్ మాస్టర్ కోసం రంగంలోకి దిగారు సోనూసూద్.

Sonu Sood Helping to Siva Shanker Master - Suman TVశివ శంకర్ మాస్టర్ పరిస్థితి తెలిసింది. ఆయన కుటుంబ సభ్యులతో ఇప్పటికే మాట్లాడాను. ఆయన వైద్యానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఆయన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. లెజండ్రీ డ్యాన్స్ మాస్టర్ ని కాపాడటానికి రంగంలోకి దిగిన సోనూసూద్ పై అన్ని వర్గాల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక గతంలో కూడా సోనూసూద్ ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలానే చేశారు.

ఇక ఎన్నో గొప్ప పాటలకు నృత్యాలను సమకూర్చి శివశంకర్ మాస్టర్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తెలుగు సినిమా స్థాయిని మించిన క్లాసికల్ డ్యాన్సర్ ఆయన. అలాంటి శివశంకర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. అలాగే.. కష్ట కాలంలో మాస్టర్ కుటుంబానికి అండగా నిలిచిన సోనూసూద్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.