వ్యాక్సిన్ ఒక్క డోస్ తీసుకుంటే ఎంత వరకు రక్షణ

vaccine

హెల్త్ డెస్క్- ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. ఫస్ట్ వేవ్, సెంకడ్ వేవ్ ద్వార జనాన్ని పట్టి పీడించింది కొవిడ్. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు బాగా తగ్గిపోయాయి. దీంతో అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఐతే కరోనా తగ్గుతున్నా.. కొత్త వేరియంట్లు మాత్రం మళ్లీ మణుకు పుట్టిస్తున్నాయి. డెల్టా ప్లస్ వేరింయట్ వెంలుగులోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ అందరికి భయం పట్టుకుంది.

ఇక కరోనా నుంచి రక్షణ పొందాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాక్సిన్ కొరత వల్ల అందరు వ్యాక్సిన్ తీసుకోలేకపోతున్నారు. భారత్ లో కూడా వ్యాక్సిన్ కొరత బాగా ఉంది. అందుకనే మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న 6 నుంచి 8 వారాల్లో ఇవ్వాల్సిన రెండో డోసును 12 వారాల తర్వాత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

vaccine

ఇక కొన్ని ఆఫ్రికా దేశాల్లో అయితే అసలు రెండో డోసు లభిస్తుందా.. లేదా.. అన్న విధంగా ఉంది పరిస్థితి. ఇటువంటి సమయంలో కరోనా డెల్టా వేరియంట్లు అంతకంతకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ సుమారు 100 దేశాలకు వ్యాప్తిచెందింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో కేవలం ఒక్క డోస్ వ్యాక్సిన్ మాత్రమే తీసుకుంటే, ప్రస్తుతం ప్రబలుతున్న వేరియంట్లపై పెద్దగా ప్రభావం కనపడటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లన్నీ 2019లో బయటపడిన వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని తయారుచేసినవే. ఇవి కొత్త వేరియంట్లపై ప్రభావం చూపడమే గొప్ప విషయం. వైరస్ మ్యూటేషన్ ఇలాగే కొనసాగితే ఈ వ్యాక్సిన్లు కూడా పనిచేయకపోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరు సరైన సమయానికి రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కొత్త వేరియంట్ల వ్యాప్తిని ఒక్క వ్యాక్సిన్ డోస్ అడ్డుకోవడం కష్టమని డబ్లూహెచ్ ఓ తేల్చి చెప్పింది. అందుకని గడువులోపల రెండో కొవిడ్ వ్యాక్సిన్ డోసు ఖచ్చితంగా తీసుకోవాలి.