నాగార్జున అని ఏకవచనం, అంతలోనే మామా అన్న పిలుపు.. సమంత ఏంచేస్తోంది

ఫిల్మ్ డెస్క్- సమంత, నాగ చైతన్య.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా వీళ్లిద్దరి గురించే చర్చ జరుగుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, నాగచైతన్యల మధ్య మనస్పర్ధలు వచ్చాయని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతే కాదు వాళ్ళిద్దరి విడాకుల వ్యవహారం ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ వరకు వెళ్లిందన్న చర్చ జరిగింది. అందుకు ఈ మధ్య సమంత ఒంటరిగా టూర్స్ వేళ్తుందని, నాగచైతన్యతో విడాకుల అంశంపై ఎక్కడా స్పందించడం లేదని అంతా భావిస్తున్నారు.

ఇదిగో ఇటువంటి పరిస్థితుల మధ్య సమంత సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా అందరి చూపు దానిపైనే పడుతోంది. ఇటువంటి సమయంలో అక్కినేని నాగార్జున షేర్ చేసిన ఓ పోస్ట్‌పై సమంత రిప్లై ఇవ్వడం, ఆ వెంటనే తాను పెట్టిన ట్యాగ్ లైన్ ఎడిట్ చేసి మరోలా రాయడం ఆసక్తికరంగా మారింది. ఇదంతా గమనిస్తే సమంత, నాగ చైతన్యల విడాకుల అంశంపై ఉన్న అనుమానాలు తొలగిపోయినట్టేననే టాక్ వినిపిస్తోంది.

nagarguna sam

అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టారంటే.. సెప్టెంబర్ 20వ తారీఖు.. నాకు చాలా స్పెషల్ డే.. నా హీరో, నా ప్రేరణ నాన్న గారి పుట్టినరోజు.. అంటూ ట్విట్టర్‌లో నాగ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇది చూసిన అక్కినేని వారి కోడలు సమంత దాన్ని రీ ట్వీట్ చేస్తూ.. ఇది చాలా బాగుంది.. అంటూ కామెంట్ పెట్టింది. దీంతో ఎప్పుడూ నాగార్జునను మామ అంటూ ముద్దుగా పిలిచే సమంత, ఈ సారి మాత్రం నాగార్జున అని ఏకవచనంతో సరిపెట్టడంతో చర్చ మొదలైంది. ఇంకేముంది సమంతపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు.

వెంటనే తన తప్పును గ్రహించిన సమంత, ఇది చాలా బాగుంది నాగార్జున మామ.. అంటూ తన ట్యాగ్ లైన్ మార్చి రీ పోస్ట్ చేసింది. ఇంకేముంది.. మామ అనే పదంతో విడాకులు అంతా ఉట్టిదేనని సమంత చెప్పకనే చెప్పిందని అంతా భావిస్తున్నారు. మరి సమంత, నాగచైతన్ల విడాకుల అంశం ప్రచారమేనా, అందులో ఏమైనా వాస్తవం ఉందా అన్నది మాత్రం అభిమానులను ఇంకా వేధిస్తూనే ఉంది.