లవ్ స్టోరీ ట్రైలర్ పై స్పందించిన సమంత, మరి నాగచైతన్యతో విడాకులు?

ఫిల్మ్ డెస్క్- అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ అందరిని అలరిస్తోంది. ఓ అబ్బాయి, మరో అమ్మాయి గ్రామీణ నేప‌థ్యం నుంచి ఓ లక్ష్యం కోసం ప‌ట్నం వ‌చ్చారు. ఈ క్రమంలో వాళ్లిద్దరు ఎలా ప్రేమ‌లో ప‌డ్డారు, వారిద్ద‌రి జీవితాల్లో ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌నే క‌థాంశంతో శేఖ‌ర్ క‌మ్ముల లవ్ స్టోరీ మూవీని తెర‌కెక్కిస్తున్న‌ట్టు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి న‌ట‌న లవ్ స్టోరీ సినిమాకే హైలెట్ గా నిలువ‌బోతుంద‌ని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక అసలు విషయం ఏటంటే లవ్ స్టోరీ ట్రైల‌ర్ పై నాగ‌ చైత‌న్య సతీమణి, హీరోయిన్ స‌మంత స్పందించారు. ల‌వ్ స్టోరీ ట్రైల‌ర్ ను విజేత‌గా అభివ‌ర్ణించారు సమంత. లవ్ స్టోరీ ట్రైలర్ పై నాగ‌చైత‌న్య ట్వీట్ కు స్పందించిన సామ్, అత‌డి గురించి ఏం ప్ర‌స్తావించ‌కుండా సినిమా ట్రైల‌ర్ విన్న‌ర్ అంటూ, సాయిప‌ల్ల‌విని ట్యాగ్ చేస్తూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేసింది.

Nagachaitanya 1

సాధారనంగా ఐతే ఇది పెద్దగా చెప్పుకోవాల్సిన అంశం కాదు. కానీ గత కొంత‌ కాలంగా నాగచైతన్య, స‌మంత‌లు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై నాగ‌చైత‌న్య గానీ, సమంత గానీ స్పందించ లేదు. విడాకుల వార్తను సమర్ధించలేదు, అలాగని కొట్టిపారేయలేదు. దీనికి తోడు సమంత తన ట్విట్టర్ ఖాతాలో తన పేరు చివర అక్కినేని అనే ఇంటి పేరును తొలగించడంతో నాగచైతన్యతో విడాకుల ప్రచారానికి బలం చేకూరింది.

ఇటువంటి సమయంలో తన భర్త నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ పై సమంత స్పందించడంతో అసలేం జరుగుతుందో అని అభిమానులు అయోమయంలో పడ్డారు. అన్నట్లు నాగ‌చైత‌న్య‌, స‌మంత 2017లో పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. మరి ఇప్పుడైనా విడాకులపై వస్తున్న వార్తలపై ఇద్దరిలో ఎవరైనా ఒకరు స్పందిస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది.