నాగచైతన్యతో విడాకులపై స్పందించిన సమంత తండ్రి జోసెఫ్

ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా నాగచైతన్య,  సమంతల విడాకుల గురించే చర్చ. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరు హఠాత్తుగా విడిపోతున్నామని ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. అసలు నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయన్నాదైనిపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు, అభిమానుల్లోను ఉత్కంఠ నెలకొంది.

నాగచైతన్య, సమంతల విడాకుల గురించి చాలా మంది సినీ ప్రముఖులు స్పందించారు. అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున, అమల నుంచి మొదలు పలువురు వీరిద్దరి విడాకులపై ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అక్కినేని అభిమానులైతే ఇంకా షాక్ లోనే ఉన్నారని చెప్పవచ్చు. ఇదిగో ఇటువంటి సమయంలో కాస్త లేట్ గా సమంత తండ్రి స్పందించారు.

Samantha 1

సమంత విడాకులు తీసుకోవడంపై ఆమె తండ్రి జోసెఫ్ మొట్టమెదటిసారి రియాక్ట్ అయ్యారు. నా మెదడు శూన్యంగా మారిపోయింది.. అని ఆయన ట్వీట్ చేశారు. త్వరలోనే పరిస్థితులు మాములుగా మారిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే అంతా సర్దుకుంటుందని నెటిజెన్లు ఆయనను ఓదార్చే విధంగా పోస్టులు పెడుతున్నారు.

ఇక సమంత కూడా విడాకుల ప్రకటన తరువాత.. ప్రపంచాన్ని మార్చాలంటే ముందు తనను తాను మార్చుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. తన పనులన్నీ తానే చేసుకోవాలని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చేయాల్సిన పనులపై శ్రద్ధ పెట్టాలని, బద్దకాన్ని వదిలి బెడ్ పై నుంచి లేచి ముందుకు నడవాలని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం నాగచైతన్య హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఉండగా, సమంత షూటింగ్ కోసం చెన్నైలో ఉంటోంది.