‘అడవి రైతు’గా పిలిచే అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ పక్షి సందడి!..

నల్లగొండ జిల్లా చందంపేట మండలం నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి అటవీ శాఖ కెమెరాకు చిక్కింది. భారత ఉపఖండంలో మాత్రమే కనిపించే ఈ జాతి పక్షి నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించిందని నాగార్జునసాగర్‌ డివిజన్‌ అటవీ అధికారి సర్వేశ్వర్‌రావు, చందంపేట అటవీ శాఖ అధికారి రాజేందర్‌ మీడియాకు తెలిపారు. ఈ పక్షికి 50 సెంటీమీటర్ల పొడవైన ముక్కుతో పాటు పొడవైన తోక ఉంటుందని వారు పేర్కొన్నారు. అడవి రైతుగా పిలిచే అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ పక్షి నల్లమల అటవీ ప్రాంతంలో సందడి చేసింది. నిజానికి ఇవి భారత ఉప ఖండంలో మాత్రమే కనిపిస్తాయి. నలుపు, తెలుపు, బూడిద రంగు కలబోతతో ఉండే ఈ గ్రేహార్న్ బిల్ ఎత్తైన చెట్లపైన, అడవిలోని కొండలు, గుట్టలపైనే సంచరిస్తుందని చెప్పారు. అత్తిపండ్లు, పాములు, బల్లులను ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు.

indian grey hornbillbopanna pattada

ఈ పక్షిని అడవి రైతు, ఫారెస్ట్ ఇంజనీర్స్ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. ఈ పక్షి నలుపు, తెలుపు, బూడిద రంగు ఆకారంలో ఉంటుందని, ఇతర పక్షుల మాదిరిగా కాకుండా ఎత్తయిన చెట్లపైన, అటవీ ప్రాంతం, కొండలు, గుట్టలపై సంచరిస్తుందని తెలిపారు. మట్టి గుళికలు, అత్తిచెట్లు, పాములు, బల్లులను ఆహారంగా తీసుకుంటుందని వెల్లడించారు. దీనిని అడవిరైతు, ఫారెస్ట్‌ ఇంజనీర్స్‌ అని కూడా పిలుస్తారని చెప్పారు. కాగా నల్లగొండ జిల్లా చందంపేట మండలం నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వేసవి కావడంతో వాటి దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు 100 నీటితొట్లను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో ఆ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నీటితొట్ల సమీపంలో సేద తీరుతున్న జంతువులను, వాటి వివరాలను డీఎ్‌ఫవో సర్వేశ్వర్‌ తెలిపారు.