ఆర్సీబీ కొత్త జెర్సీ అదిరిపోయింది

Royal Challengers Bangalore New Jersey - Suman TV

ధనాధన్‌ క్రికెట్‌ ఐపీఎల్‌ 2021 రెండో భాగం మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇండియాలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు మంచి ప్రదర్శనే కనబర్చింది. 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కాగా రెండో భాగం ఐపీఎల్‌లో ఈ నెల 20న కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ కొత్త జెర్సీలో మెరవనుంది. డాన్‌ బ్లూ కలర్‌లో ఉన్న జెర్సీని ఆర్సీబీ ప్లేయర్లు విడుదల చేశారు. ఈ కొత్త జెర్సీ ధరించి మైదానంలో దిగడం వెనుక ఒక కారణం ఉంది. కరోనా కష్టకాలంలో మనకు సేవలు అందిస్తున్న ఫ్రెంట్‌లైన్‌ వారియర్స్‌ ధరించే పీపీఈ కిట్‌ రంగును సూచించే విధంగా డాన్‌ బ్లూ కలర్‌ జెర్సీని ధరిస్తున్నారు.

Royal Challengers Bangalore New Jersey - Suman TVవారి సేవలకు కృతజ్ఞతగా ఒక మ్యాచ్‌లో ఈ రంగు జెర్సీ ధరిస్తున్నట్లు ఆర్సీబీ తెలిపింది. గతంలో పర్యావరణ పరిరక్షణపైళ అవగాహణ కల్పించేందుకు ఆర్సీబీ జట్టు గ్రీన్‌ కలర్‌ జెర్సీని ధరించి ఒక మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సారీ ఎలాగైనా ఐపీఎల్‌ కప్‌ కొట్టాలని ఆర్సీబీ ఆటగాళ్లు బలంగా ప్రయత్నిస్తున్నారు. మొదటి భాగంలో మంచి ప్రదర్శనను కొనసాగిస్తూ ‘ఈ సాలా కప్‌ నమ్‌దే’ అనే నినాదాన్ని నిజం చేసి చూపించాలని పట్టుదలతో ఉన్నారు. ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌ రద్దు కావడంతో ఆర్బీబీ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హైదరాబాద్‌కి షాన్‌, ఆర్సీబీ పేసర్‌ సిరాజ్‌ ప్రత్యేక విమానంలో యూఏఈ చేరుకున్నారు.