కెప్టెన్ గా ఉండనన్న రషీద్ ఖాన్.. ఆఫ్ఘాన్ క్రికెట్ లో గందరగోళం

I Cant Be a Captain To Afghanistan - Suman TV

అఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్థితుల కారణంగా వచ్చే నెలలో జరగనున్న ట్వీ20 వరల్డ్ కప్ లో అసలు ఆ దేశపు జట్టు పాల్గొంటుందా లేదా అనే సందేహాన్ని అటు క్రికెట్ అభిమానులు, ఇటు విశ్లేషకులు వ్యక్తం చేశారు. అనుమానాలకు తెర దించుతూ అఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) గురువారం ట్వీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే జట్టును ప్రకటించింది. అందులో ప్రపంచ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ ను కెప్టెన్ గా నియమించింది. ఏసీబీ జట్టు ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే తనకు సారథ్య బాధ్యతలు వద్దంటూ రషీద్ ఖాన్ బాంబు పేల్చాడు. ‘నాయకుడిగా జట్టు సభ్యుల ఎంపికలో నా అభిప్రాయం తెలిపే హక్కు నాకుంది. వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేసే విషయంలో అఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నన్ను అసలు సంప్రదించలేదు. నా సలహాలు, సూచనలను సెలక్షన్ కమిటీ అడగలేదు. నేను ఇప్పుడే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్న. అఫ్ఘనిస్తాన్ తరఫున ఆడడాన్ని నేనెప్పుడూ గర్వంగా భావిస్తా’ అని రషీద్ ఖాన్ తన ట్వీట్టర్ ఖాతాలో తెలిపారు.

I Cant Be a Captain To Afghanistan - Suman TVరషీద్ అలకకు కారణం ఏంటి..?

టీ20 ప్రపంచకప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో గతంలో బాగా రాణించిన పలువురు ఆటగాళ్లు ఉన్నారు, కానీ ఇటీవల కాలంలో జాతీయ జట్టులో లేరు. 2019 చివరిలో ఒక సంవత్సరం పాటు నిషేధం ఎదురుకొన్నమొహమ్మద్ షాజాద్ కూడా ఉన్నాడు. పేసర్ షాపూర్ చివరిగా మార్చి 2020 లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. మరో పేసర్ దావ్లాత్ సెప్టెంబర్ 2019లో ఆడాడు. 2016 మార్చి నుంచి ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని గాయపడిన హమీద్ హసన్ కూడా జట్టులో దక్కడం క్రికెట్ పండితులకు ఆశ్చర్యం కలిగించింది. ఇలా ఈ మధ్య కాలంలో సరిగా క్రికెట్ ఆడని చాలా మందిని ఎంపిక చేయడమే రషీద్ ఖాన్ కెప్టెన్ షిప్ వద్దనడానికి కారణం అయి ఉండొచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టు..
రషీద్ ఖాన్(కెప్టెన్), ముజీబ్ ఉర్ రెహ్మాన్, రహ్మానుల్లా గుర్బాజ్(wk), కరీం జనత్, హజరతుల్లా జజాయ్, గుల్బాదిన్ నాయబ్, ఉస్మాన్ ఘని, నవీన్ ఉల్ హక్, అస్ఘర్ ఆఫ్ఘన్, హమీద్ హసన్, మొహమ్మద్ నబీ, షరఫుద్దీన్ అష్రఫ్, నజిబుల్లా అష్రఫ్ జద్రాన్, హష్మతుల్లా షాహిది, షాపూర్ జాద్రాన్, మహ్మద్ షాజాద్ (wk),కైస్ అహ్మద్. రిజర్వ్‌ ఆటగాళ్లు: అఫ్సర్ జజాయ్, ఫరీద్ అహ్మద్