కుంభమేళా చూడ్డానికి రమ్మని మత్తుమందు.. రెండేళ్లుగా రేప్‌ చేస్తున్న పోలీస్‌

raped by cop uncle for 2 years in allahabad - Suman TV

ప్రపంచంలోనే పెద్ద సమ్మేళనం అయిన కుంభమేళాను చూసేందుకు బంధువు ఆహానిస్తే ఆనందంగా వెళ్లిన యువతి జీవితం ఊహించని విధంగా నాశనమైపోయింది. మనోళ్లే కదా అని గుడ్డిగా నమ్మిన పాపానికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేసి, ఆ దారుణాన్ని వీడియో తీసి, దాన్ని అడ్డం పెట్టుకుని రెండేళ్లుగా ఆ యువతికి నరకం చూపించాడో దుర్మార్గపు పోలీసు. జీవితంపై విరక్తి చెందిన ఆమె గంగా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా ఈ దారుణం బయటపడింది.

వివరాలు.. మీర్జాపూర్‌ జిల్లా కాన్‌పూర్‌కు చెందిన యువతి కుటుంబాన్ని 2019 కుంభమేళాలో పాల్గొనేందుకు రావాల్సిందిగా అల్‌హాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న బంధువు ఆహ్వానించాడు. అల్‌హాబాద్‌ వెళ్లిన తర్వాత యువతిని ఆ బంధువు ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. పథకం ప్రకారం మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహా కోల్పోయింది. ఆ మానవ మృగం ఆమెపై అత్యాచారం జరిపి, ఆ దారుణాన్ని వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను అడ్డం పెట్టుకుని యువతిని పలుమార్లు లైంగిక దాడి చేశాడు.

దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. ఆమె విషయం అతనికి చెప్పగా విషయం ఎక్కడ బయటికి వస్తుందోనని యువతిని కొడుకుతో కలిసి బంధించి, ఇద్దరూ కలిసి మళ్లీ లైంగిక దాడి చేసి వీడియో తీశారు. వారి చెర నుంచి ఎలాగోలా బయటపడిన యువతి పోలీసులకు ఫోన్‌ చేసి, గంగానదిలో దూకింది. సమయానికి అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను కాపాడారు. అనంతరం ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతులను అరెస్టు చేసే పనిలో ఉన్నారు. యువతిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.