ర్యాగింగ్ కలకలం.. బట్టలు విప్పించి.. ఆపై మరీ దారుణం..!

ragging

నిజామాబాద్ జిల్లా కేంద్ర‌లోని తెలంగాణ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో ర్యాగింగ్ క‌ల‌క‌లం రేపింది. దీంతో కళాశాలలోని సీనియర్ వైద్య విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ కు పాల్పడుతూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. దీంతో సీనియర్ వైద్య విద్యార్థులు తమ జూనియర్ లను ఏకంగా బట్టలు, విప్పించటంతో పాటు రికార్డులు సైతం రాయించుకుంటున్నారని బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

raggingఇక ఇదే విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపల్ డాక్ట‌ర్ ఇందిరాకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ ఎలాంటి ర్యాగింగ్ అంశం మా వరకు రాలేదని, ఇకపై అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం తల్లిదండ్రలుకు చెప్పి పంపించారు. ఇక తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.