ముంబయిలో కారులో వెళ్తున్న పూరి, ఛార్మిలకు వింత అనుభవం

ఫిల్మ్ డెస్క్- సినిమా తారలు, డైరెక్టర్లకు సహజంగానే అభిమానులు ఉంటారు. ఇంకాస్త ఫేమస్ ఫిల్మ్ పర్సనాలిటీస్ కు జనంలో బాగా క్రేజ్ ఉంటుంది. అనుకోకుండా సినిమా వాళ్లను చూస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ఇదిగో ముంబయిలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఛార్మీలను చూసిన ఓ అభిమాని ఆనందం అంతా ఇంతా కాదు.

పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ నిర్మాత కరణ్ జోహర్‌తో కలిసి పూరి, ఛార్మీ నిర్మిస్తోన్న ఈ మూవీ పేరు లైగర్. ఈ సినిమా ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ జరుపుకుంటోంది. లైగర్ సినిమా షూటింగ్ కోసం పూరి జగన్నాధ్, ఛార్మీలు ఏకంగా ముంబయికే మకాం మార్చేశారు. గత కొన్ని రోజులుగా ముంబయిలో ఉంటూ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

charmi purijagannadh 1

తాజాగా ముంబయి వీధుల్లో కారులో వెళుతున్న పూరి జగన్నాధ్, ఛార్మీలకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఈ అనుభవాన్ని స్వయంగా ఛార్మీ ట్విట్టర్ పోస్ట్ చేసింది. లైగర్ సినిమా షూటింగ్ నిమిత్తం పూరి, ఛార్మీ కారులో వెళుతుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రమోద్ అనే యువకుడు వారిని పలకరించాడు. వాళ్లు ప్రయాణిస్తున్న కారుకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ నంబర్ ఉండటంతో, తెలుగు యువకుడైన ప్రమోద్, కారులో ఉన్న పూరి, ఛార్మీలను గుర్తుపట్టాడు.

అంతే ఇక ఏ మాత్రం అలస్యం చేయకుండా కారు దగ్గరకు వచ్చి వారిని పలకరించాడు. లైగర్ సినిమా కోసం తాను ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లు పూరికి చెప్పాడు. అంతే కాదు పూరితో సెల్ఫీ తీసుకోవాలనిఅనుకున్నాడు, కానీ సమయానికి తన దగ్గర ఫోన్ లేకపోవడంతో నిరాశచెందాడు ప్రమోద్. ఆ యువకుడిని ప్రేమగా పలకరించిన పూరి, అతని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదంతా వీడియో తీసిన ఛార్మీ, ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.