నువ్వు కూడా రేడీనా.. అల్లు స్నేహా రెడ్డిపై ప్రీతమ్ జుకల్కర్ సంచలన కామెంట్

ఫిల్మ్ డెస్క్- ప్రీతమ్ జుకల్కర్.. ఇప్పుడు టాలీవుడ్‌ లో ఇతనే హాట్ టాపిక్. సెలెబ్రిటీ స్టైలిష్ట్, డిజైనర్ అయిన ప్రీతమ్ సమంత, నాగచైతన్యలు విడిపోవడానికి సూత్రధారి అన్న ప్రచారం జరుగుతోంది. సమంత ఫ్రెండ్‌ గా ప్రీతమ్‌కు ఒకప్పుడు మంచి ఇమేజ్ ఉండేది. అదే సమయంలో సమంత, ప్రీతమ్ రిలేషన్ షిప్‌పై చాలా పుకార్లు, కామెంట్లు వచ్చాయి.

అయితే సమంత, తాను బ్రదర్ అండ్ సిస్టర్ వంటి వారమని, తాను సమంతను అక్కా అని పిలుస్తానని ప్రీతమ్ క్లారిటీ ఇచ్చాడు. అంతే కాదు తమ బంధం గురించి నాగచైతన్యకు కూడా తెలుసుని ప్రీతమ్ చెప్పుకొచ్చాడు. సమంతతో తన బంధం గురించి రూమర్స్ వచ్చినప్పుడు నాగచైతన్య స్పందించకపోవడం తనను బాధించిందని కూడా ప్రీతమ్ చెప్పాడు.

Samantha 1 4

తాను సమంతకు ఎలాంటి సమయాల్లోనైనా తోడు ఉంటానని, తన అక్కను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడంతో ఎంతో గర్వపడుతున్నానంటూ ప్రీతమ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ ఐన సంగతి అందరికి తెలుసు. ఇదిగో ఇలాంటి సమయంలో ప్రీతమ్ జుకల్కర్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి పై సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ ఆసక్తికరంగా మారింది.

ప్రీతమ్‌కు అల్లు స్నేహారెడ్డితో మంచి స్నేహబంధమే ఉన్నట్టు తెలస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అర్హ, అయాన్‌ లు మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ప్రీతమ్హెయిర్ స్టైలీష్ట్ దగ్గరికి వెళ్లినట్టు కనిపిస్తోంది. అలా తన జుట్టును కత్తిరిస్తుంటే.. నువ్ కూడా ఇందుకు రెడీగా ఉన్నావా.. అంటూ అల్లు స్నేహారెడ్డిని ప్రీతమ్ ట్యాగ్ చేశాడు. అయితే స్నేహారెడ్డి మాత్రం ఇంకా రిప్లై ఇవ్వలేదు. కానీ ఉన్నట్లుండి ప్రీతమ్ జుకల్కర్ అల్లు స్నేహా రెడ్డిని ఎందుకు ట్యాగ్ చేశాడా అని అభిమానులంతా ఆలోచనలో పడ్డారు.