నేనో పోలీస్ ని.. నేనో హౌలాగాడ్ని అంటూ కానిస్టేబుల్ రచ్చ.. వీడియో వైరల్

నాగర్ కర్నూల్ జిల్లాలో సామాన్య వ్యక్తిపై ఓ కానిస్టేబుల్ పరుషపదజాలంతో దూషిస్తూ వీధిరౌడిలా ప్రవర్తించాడు. ఆదివారం రాత్రి వినాయకుడి మండపం ఎదుట ఉన్న వారిని ఏ కారణం చేతనో బూతులు తిడుతూ.. ‘ఎందుకు రా అనవసరమైన విషయాల్లో తలదూర్చుతున్నావంటూ హెచ్చరిస్తూ.. రారా చూసుకుందాం. నేను పోలీస్ ని నేనో హౌలాగాడ్ని కొడితే గోడకు తగిలి ముక్కలైతవ్’అంటూ గల్లా ఎగరేస్తూ హల్ చల్ చేశాడు.

తర్వాత మాట్లాడుకుందాం అన్న పోలీసులు..

Drunk Constable Fighting - Suman TVఈ విషయమై అక్కడున్న యువకులు డయల్ 100కు ఫోన్ చేసి జరుతున్న తతంగం గురించి చెప్పగా కానిస్టేబుల్ అని చెప్పడంతో తర్వాత మాట్లాడుకుందాం అని ఫోన్ కట్ చేశారు. ఈ విషయాన్ని కూడా జోడిస్తూ ఉదయం పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి జరిగిన తతంగానంతా వీడియో తీసిన యువకులు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. కాగా సదరు కానిస్టేబుల్ పై గతంలో పలు అవినీతి, బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తుంది.