బిగ్‌ బ్రేకింగ్‌: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం..

న్యూ ఢీల్లీ- భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై బీజేపీ సర్కార్ వెనక్కి తగ్గింది. మోదీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై సుమారు యేడాదిన్నర కాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండు చేస్తూ వస్తున్నారు.

ఆ మేరకు చాలా కాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రైతుల డిమాండ్ ను, వ్యవసాయ చట్టాలపై పెరుగుతున్న వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. రైతుల ఆందోళనలతో కేంద్రం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

PM Modi

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం సంచలన ప్రకటన చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాన ప్రకటన చేశారు. దీనికి సంబందించిన ప్రక్రియను పార్లమెంట్ సమావేశాల్లో చేపడతామని మోదీ చెప్పారు. దేశంలో రైతుల ప్రయోజనాల కోసం, రైతుల సంక్షేమం కోసం తన ప్రభుత్వం కట్టుబటి ఉందని మరోసారి ప్రధాని మోదీ స్పష్టం చేసారు.