కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు బర్త్‌డే విషెష్‌ చెప్పిన జనసేన అధినేత

Amith Shah Birthday wishesh from Pawan Kalyan - Suman TV

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పుట్టిన రోజు సందర్భంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోషల్‌ మీడియా అకౌంట్లలో విషెష్‌ చెప్తూ పోస్టు చేశారు. అమిత్‌షా 57వ పుట్టిన రోజు సందర్భంగా మనస్ఫూర్తిగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు, బాలాజీ కృపతో ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.  కాగా ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి. బద్వేల్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు తెలిపింది. బీజేపీ అభ్యర్తి తరఫున ప్రచారం చేయనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. కాగా బద్వేల్‌ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉన్న జనసేన బీజేపీ మద్దతివ్వడం గమనార్హం.