ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు..

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులను ప్రకటిస్తూ వస్తున్నారు. 2021 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ముగ్గుర్ని వరించింది. స్యుకురో మనాబే, క్లాస్ హాసెల్ మన్, జార్జియో పరీసీలను సంయుక్తంగా నోబెల్ పురస్కారానికి ఎంపిక చేశారు. భౌతికశాస్త్రంలో పరిశోధనాత్మక రచనలకు గాను వీరికి నోబెల్ లభించింది. అయితే శాస్త్రవేత్తలు సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలను ఈ ఏడాది నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది.

asdgasg minఇక ఎంతో సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలకు సంబంధించిన మూలాలను ఛేదించడంలో ఈ ముగ్గురి పరిశోధనలు, రచనలు ఎనలేనివని నోబెల్ ప్రైజ్ మాతృసంస్థ ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది. మానవజాతికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక సంక్లిష్ట వ్యవస్థ భూ వాతావరణం. స్యూకురో మనాబే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిన స్థాయిలు.. భూమి ఉపరితలం పై పెరిగిన ఉష్ణోగ్రతలకు ఎలా దారితీస్తాయో నిరూపించారు సుకురో మనాబో.

bobel minక్లాస్ హాసెల్ మన్ జర్మనీకి చెందిన సముద్ర శాస్త్ర నిపుణుడైన ఆయన తన వాతావరణంలో సహజ దృగ్విషయం అయిన మానవ కార్యకలాపాలు ముద్రించే నిర్దిష్ట సంకేతాలను, వేలిముద్రలను గుర్తించే పద్ధతులను కూడా అభివృద్ధి చేశారు. వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రత కార్బన్ డయాక్సైడ్ మానవ ఉద్గారాల కారణంగానే అని నిరూపించడానికి ఆయన పద్ధతులు ఉపయోగపడ్డాయి.

ఇటలీకి చెందిన సిద్ధాంతపరమైన భౌతికశాస్త్ర నిపుణుడైన జార్జియో పరీసి భౌతిక శాస్త్రంలోనే కాకుండా గణితం, జీవశాస్త్రం, న్యూరోసైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఇతర విభిన్న రంగాలలో కూడా అనేక విభిన్నపై పరిశోదన చేశారు. జార్జియో పారిసి 1980 లో, క్రమరహిత సంక్లిష్ట పదార్థాలలో దాచిన నమూనాలను కనుగొన్నాడు.