పాడె మోసేందుకు ఒక్కరు రాలేదు.. దిన కర్మ భోజనానికి 150 మంది

నేషనల్ డెస్క్- కరోనా మానవ సంబంధాలను తెంచేస్తోంది. కుటుంభాలను చిన్నా భిన్నం చేస్తోంది. ఈ మహమ్మారి మనిషిలోను మానవత్వాన్ని మంటగలుపుతోంది. కరోనా తో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు చాలా చోట్ల ఒక్కరు ముందుకు రావడం లేదు. కొన్ని సందర్బాల్లో సొంత కుటుంబ సభ్యులు సైతం దహన సంస్కారాలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో చాలా మంది అనాధ శవాలుగా మిగిలిపోతున్నారు. కరోనా మానవ బంధాల్ని దూరం చేసిందనేందుకు బీహార్ లో ఓ ఘటన నిదర్శనంగా నిలిచిందీ. కరోనాతో చనిపోయిన మహిళ మృత దేహానికి అంత్యక్రియలు జరిపేందుకు ఎవరూ రాకపోగా, పదో రోజు భోజనాలకు మాత్రం 150 మంది రావడం విస్తుగొలుపుతోంది. బీహార్ లోన జరిగిందీ అమానుష ఘటన.

Soni

అరియా జిల్లాలో బిష్ణుపు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు సోని(18) నితీష్(14) చాందిని(12) నాలుగు రోజుల వ్యవ‌ధిలో త‌ల్లితండ్రులు బిరేంద్ర సింగ్, ప్రియాంక దేవిని కోల్పోయి అనాధలుగా మిగిలారు. తండ్రి కొన్ని రోజుల క్రితమే అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తరువాత కొన్ని రోజుల వ్యవధిలోనే తల్లి కూడా కరోనాతో మరణించింది. దీంతో ఆ ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. ఐతే తల్లి అంత్యక్రియల కోసం ఆ చిన్నారులు సాయం అడిగితే ఎవరు ముందుకు రాలేదు. రెండు వేల మంది జనాభా ఉండే ఆ గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు సాయం చేయలేదు. దీంతో ఇంటికి దగ్గర్లోనే తల్లికి అంత్యక్రియలు నిర్వహించింది పెద్ద కూతురు సోని.

ఇక ఆ తరువాత తల్లి దండ్రుల ఆత్మ శాంతి కోసం 10వ రోజు నిర్వహించిన దశదిన కర్మ భోజనానికి మాత్రం 150 మంది గ్రామస్తులు వచ్చారు. ఐతే వచ్చిన వాళ్లు బోజనం చేసి వెళ్లకుండా, తల్లి దండ్రుల వైద్యానికి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆ చిన్నారులను పీక్కుతిన్నారు. వారి దగ్గర ఉన్న డబ్బులను బలవంతంగా తీసుకుని అక్కడికి వచ్చిన వాళ్లంతా పంచుకున్నారట. గ్రామస్తులు ప్రవర్తించిన తీరుకు ఆ చిన్నారులు కన్నీటి పర్వంతమయ్యారు. దశదిన కర్మ భోజనానికి ఇంత మంది వస్తారాని అనుకోలేదని, వచ్చి ఇలా డబ్బులు వసూలు చేశారని ఆవేధన వ్యక్తం చేసింది. మానవత్వం మంటకలిసిందనడానికి ఈ ఘటన చాలు.