కన్నీళ్లు తెప్పించే విషాద వార్త..కన్నతండ్రినే గొలుసులతో బంధించిన కొడుకులు..!

uttar pradesh father saval singh sons bound in chains ..! - Suman Tv

పాతిక ఏళ్ళు వచ్చేదాకా పెంచి పెద్దచేస్తారు మన తల్లిదండ్రులు. వారిని కంటికి రెప్పలా కాపాడల్సింది పోయి కొందరు రాక్షసులు ఆస్తి కోసం దేనికైన సిద్దపడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ మధుర జిల్లా శిహోరలో జరిగిన ఈ ఘటన సగటు మనిషికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే..సవాల్ సింగ్ అనే తన తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకునేందుకు అన్న దమ్ములు అంతా సిద్ధమయ్యారు. దీనికి సమయం చూసుకుని ఆస్తి పంపకాలకు వాళ్ళు రెడీ అయ్యారు. దానికి తండ్రి సవాల్ సింగ్ నిరాకరించడంతో దారుణానికి ఒడిగట్టారు.

Sons who chained the father 01 min 1కన్నతండ్రి అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా వ్యవహరించారు. ఇక చివరికి ఆయన ఒప్పుకోకపోవడంతో ఆయన కాళ్ళు, చేతులు గొలుసులతో మంచానికి కట్టి ఓ ఇంట్లో బంధించారు. ఎటు కదలకుండా చేయడంతో ఆ వృద్దుడు మాల, మూత్ర విసర్జన కూడా అక్కడే చేసుకునే దుస్థితి ఏర్పడింది. ఇక ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోనే ఉండిపోయారు తండ్రి సవాల్ సింగ్. ఎలాగైనా తప్పించుకోవాలని భావించాడు ఆ వృద్ధుడు. ఇక చివరికి తన మనవళ్ల సాయంతో ఎట్టకేలకు బయటపడ్డాడు. దీంతో ఎలాగైనా వాళ్ళ భరతం పట్టేందుకు సిద్దమై జూన్ 25న స‌వాల్ సింగ్ సీనియ‌ర్ సిటిజ‌న్స్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేశారు. ఇక వారికి ఈ దారుణ పరిస్థితిని వివరించి తన ఆవేదనను వెళ్లగక్కాడు వృద్ధుడు.