తనకోసం తెలంగాణా అభిమాని 700 కి.మీ. పాదయాత్ర చేయడంతో చలించిపోయిన సోనూసూద్!…

కరోనా కష్టకాలంలో దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న ఏకైక రియల్ హీరో. కష్టాల్లో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తూ.. కన్నీళ్లు తుడుస్తూ ఆకలి దప్పులు తీరుస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నిజజీవితపు హీరో ప్రభావం రోజు రోజూకూ పెరిగిపోతోంది. సోనూ సూద్ కార్యక్రమాలతో ఉత్తేజం పొందిన తెలంగాణలోని వికారాబాద్ కు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఇంతవరకు అతని కోసం ఎవరూ చేయసి సాహసం చేశాడు. దాదాపు 700 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు.

sonu sood fan Hiking compressed

వీపుకు రెండు జతల గుడ్డలున్న బ్యాగు తగిలించుకుని సోనూ సూద్ పోటోతో ఉన్న ప్లకార్డు చేతపట్టి చలో ముంబై అంటూ బయలుదేరాడు. ‘‘రియల్ హీరో సోనూ సూద్ – నా గమ్యం నా గెలుపు” ట్యాగ్ లైన్ తో హైదరాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర అని రాసిన ప్లకార్డుతో కాలినడక కొనసాగించాడు . మార్గ మధ్యలో ఎండా కాలం తీవ్ర కష్టాలు చవిచూశాడు. లాక్ డౌన్ కారణంగా ఎక్కడా సరైన ఆహారం దొరక్కున్నా ఎంతో శ్రమకోర్చి ముంబై మహానగరం చేరుకున్న అభిమాని కోసం సోనూసూద్ స్వయంగా ఇంటి గేటు వద్దకు వచ్చాడు. వచ్చీ రావడంతోనే తన కాళ్లకు దండం పెట్టిన అభిమాని వెంకటేష్ ను వారించి అక్కున చేర్చుకున్నాడు సోనూసూద్.

అభిమాని వెంకటేష్ తో ఫోటో దిగి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఇంత దూరం ఎందుకు రావడం హైదరాబాద్ కు వస్తుంట కదా అంటూ సున్నితంగా వారించాడు సోనూ సూద్. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఈసారి హైదరాబాద్ కు వచ్చినప్పుడు కలుద్దామంటూ అభిమాని వెంటకేష్ కు హామీ ఇచ్చాడు. ఎవరూ ఇలా చేయొద్దంటూ మీ పక్కన మీకు దగ్గరలో ఉన్న వారిని ఆదుకునే కార్యక్రమాలు చేపట్టాలని సూచించాడు సోనూసూద్.