కరోనా కట్టడికి సూర్యనమస్కారం! పిలుపునిచ్చిన కేంద్రం

ప్రస్తుతం కరోనా థర్డ్‌ వేవ్‌ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లతో ప్రపంచ మానవాళి జీవనం అస్తవ్యస్తం అయింది. కాగా అన్ని దేశాలు కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. అలాగే మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఆయూష్‌ మంత్రిత్వ శాఖ కరోనా కట్టడికి ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. మకర సంక్రాంతి సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచవ్యాప్తంగా సూర్య నమస్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఇందులో దాదాపు కోటి మంది ప్రజలు పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమానికి అస్సాం నుంచే ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా, ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజలను వారి ఇంటి వద్ద ‘సూర్య నమస్కార్’ చేయాలని పిలుపునిచ్చింది. రిజిస్ట్రేషన్ లింక్‌లో వీడియోను అప్‌లోడ్ చేయాలని కోరింది. గురువారం, మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. “మకర సంక్రాంతి స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ శుభ సందర్భంగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ మొదటి ప్రపంచ సూర్య నమస్కార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది, ఇందులో సుమారు కోటి మంది ప్రజలు చేయవచ్చు.

ఈ కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తూ, మంత్రిత్వ శాఖ, ‘సూర్య నమస్కార్ పెద్ద ఎత్తున వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్ గురించి సందేశాన్ని పంపుతుంది. వాతావరణ అవగాహన తప్పనిసరి అయిన నేటి ప్రపంచంలో, రోజువారీ జీవితంలో సోలార్ ఇ ఎనర్జీ అమలు చేయడం వల్ల మన గ్రహానికి ముప్పు కలిగించే కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది. ప్రముఖ యోగా సంస్థలు, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్, యోగా సర్టిఫికేషన్ బోర్డ్, ఫిట్ ఇండియా సహా అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కూడా గ్లోబల్ సూర్య నమస్కార్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. మరి కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.