ఆమె పేరు అర్పుతం అమ్మాళ్.. నీళ్లు నిండిన కళ్లతో సంతోషం తరుముకుంటూ వచ్చింది. బరువెక్కిన గుండెతో వెక్కి వెక్కి ఏడ్చిన ఆ క్షణాలు ఒక్కసారిగా ఆమె కళ్ల ముందు తెలియాడాయి. యావత్ ప్రపంచానికి దక్కని విజయం తనకే దక్కిన ఆనందంతో ఉప్పింగిపోతోంది. ఏం చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో మాటలు రాని పరిస్థితి. కానీ ఓ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత విజయం సాధించిన ఆ తల్లి తీరు ఇది. ఇక విషయం ఏంటంటే? మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏడుగురు దోషుల్లో ఒకరు యావజ్జీవ ఖైదీ, ఏజీ పెరారివాలన్ ను విడుదల చేయాలని సుప్రీం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 19 ఏళ్ల వయసులో అరెస్టై, గత మూడు దశాబ్దాలుగా జైల్లో శిక్ష అనుభవించిన 50 ఏళ్ల వయసున్న పెరారివాలన్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఇక తల్లి అర్పుతం అమ్మాళ్ తన 30 ఏళ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత ఆమె కుమారుడు ఏజీ పెరారివాలన్ బాహ్య ప్రపచంలోకి అడుగుపెట్టబోతున్నాడని తెలిసి అర్పుతం అమ్మాళ్ ఒక్కసారిగా సంతోషం ఉప్పొంగిపోయింది. చేయని నేరానికి కొడుకు అన్యాయంగా జైల్లో మగ్గుతున్నాడని ఎన్నో ఏళ్లు కోర్టు మెట్లెక్కింది. ఎన్నో అవమానలు, మరెన్నో అడ్డంకులను ఎదుర్కొంది. ఇలా ఏవి అడ్డోచ్చినా తన మొక్కవోని నమ్మకంతో ముందుకు వెళ్లింది. ఇక ఎట్టకేలకు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని ఉంచి చివరికి విజయాన్ని సాధించిందీ అర్పుతం అమ్మాళ్. గత 30 ఏళ్ల పోరాటంలో మాజీ ప్రధాన మంత్రులకు రాసిన అనేక లేఖలు , మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మాజీ సిబిఐ అధికారి వి త్యాగరాజన్‌కు, జస్టిస్ కృష్ణయ్యర్, రిటైర్డ్ జస్టిస్ కెటి థామస్ ఇలా ఎంతో మంది కలిసి తన గోడును వివరించే ప్రయత్నం చేసింది. ఇక అన్ని ఫలించి చివరికి కొడుకు విడుదలైన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. “మీ అందరినీ ఇంత కాలం వూ వేచి ఉంచినందుకు క్షమాపణలు కోరుతున్నా, కానీ నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. మీ అందరికీ ధన్యవాదాలు. మా పోరాటం 30 ఏళ్లు సాగింది. ఇంతకాలం మమ్మల్ని ఆదరించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కి, ఇతర ముఖ్యులకు అందరికీ కృతజ్ఞతలు. అసలు తాను ఎవరో తెలియని వారు కూడా అండగా నిలిచారు’’ అంటూ తల్లి అర్పుతం అమ్మాళ్ అందరికీ నీరు నిండిన కళ్లతో ధన్యవాదాలు తెలిపారు. కొడుకు కోసం ఓ తల్లి చేసిన 30 ఏళ్ల సుధీర్ఘ పోరాటంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.