రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జీవితఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన పేరరివాలన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాన్ని ఉపయోగించి పేరరివాలన్‌ను విడుదల చేసింది సర్వోన్నత న్యాయస్థానం. రాజీవ్ హత్య కేసులో పెరరివాలన్.. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు. ఈ క్రమంలోనే తన శిక్షను మినహాయించాలని 2018లో తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసినప్పటికీ విడుదలలో జాప్యం జరుగుతుందని పెరరివాలన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏజీ పేరరివాలన్‌ను విడుదల చేయాలని జస్టిస్ ఎల్ నాగేశ్వర రావ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది.
ఇది చదవండి: Ram Prasad: సుధీర్, శ్రీనులపై అనిల్ రావిపూడి ప్రశ్న.. రామ్ ప్రసాద్ ఎమోషనల్ రిప్లై!
రాజీవ్ గాంధీని 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసుకు సంబంధించి 19 ఏళ్ల వయసులో పెరరివాలన్ అరెస్టయ్యాడు. ఈ కేసులో 1999 మేలో పెరారివలన్, మురుగన్, శాంతమ్, నళినికి మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్రం క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో 11 ఏళ్ల జాప్యం కారణంగా సంతన్, మురుగన్, పెరారివలన్ మరణశిక్షను సర్వోన్నత న్యాయస్థానం జీవిత ఖైదుగా మార్చింది. పెరారివలన్‌కు ఉపశమనం కల్పించేందుకు.. సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాన్ని ఉపయోగించింది. సంబంధిత పరిశీలనల ఆధారంగా తమిళనాడు మంత్రివర్గం తన నిర్ణయం తీసుకుందని.. ఆర్టికల్ 142 ప్రకారం దోషిని విడుదల చేయడం సముచితమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇది చదవండి: Turkey: భర్త తలకి బోను పెట్టి తాళం వేస్తున్న భార్య.. ఎందుకంటే..!
పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు ఎటువంటి ఫిర్యాదుల చరిత్ర లేకపోవడం సహా సుదీర్ఘమైన జైలు శిక్షను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం మార్చి 9న పెరారివలన్‌కు.. బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజాగా పెరరివాలన్‌ను విడుదల చేయాలని సుప్రీం ఆదేశాలు.. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర దోషుల విడుదలకు కూడా మార్గం సుగమం చేస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.