సాధారణంగా రైల్వే టికెట్ కౌంటర్ వద్ద టికెట్ కొనాలంటే క్యూలో నిలబడి ఎంతో వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇక టికెట్లు ఇచ్చేవారు.. నిదానంగా తమ పనులు చేయడంతో ప్రయాణీకులకు చిరాకు వచ్చేది.. టికెట్లు ఇచ్చే వ్యక్తిపై తరచూ ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. ఈ ప్రక్రియ కష్టతరంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు ప్లాట్‌ఫాంలపై రైల్వేశాఖ వారు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లను (ఏటీవీఎం) ఏర్పాటు చేస్తున్నారు. ఓ ఆపరేటర్ మిషన్ వద్ద అత్యంత వేగంగా మిషన్ ఆపరేట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత రైల్వేకు చెందిన ఈ ఉద్యోగి ఓ ప్రయాణీకుడు నుంచి డబ్బులు తీసుకొని మరో ప్రయాణీకుడిని ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతూ సెకన్ల వ్యవధిలోనే ఏటీవీఏంలో పలు ఫీల్డ్స్ ని టకా టకా ఎంటర్ చేస్తూ టికెట్స్ ఇస్తున్నాడు. మొత్తానికి ఆ ఎంప్లాయి ఏటీవీఏం మెషీన్ స్క్రీన్‌ను అత్యంత వేగంగా టైప్ చేయడం చూస్తూ ఇతను మిషన్ కన్నా వేగంగా ఉన్నాడే అంటున్నారు. ఈ వీడియో క్లిప్ ని ముంబై రైల్వే యూజర్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియో దాదాపు 8,80,000 వ్యూస్‌ను రాబట్టింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Somewhere in Indian Railways this guy is so fast giving tickets to 3 passengers in 15 seconds. pic.twitter.com/1ZGnirXA9d — Mumbai Railway Users (@mumbairailusers) June 28, 2022