బిగ్ బ్రేకింగ్:ప్రియాంకా గాంధీ అరెస్ట్..!

లఖింపూర్ జిల్లాలో చెలరేగిన హింసాకాండపై న్యాయం కోసం పోరాడుతున్న ప్రియాంక గాంధీ వాద్రాను ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత 35 గంటలు గృహ నిర్భందంలో ఉంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీతాపూర్ గెస్ట్ హౌజ్ ను జైలుగా మార్చిన యూపీ పోలీసులు తెలిపారు. కాగా, ఢిల్లీకి దాదాపు 440 కిలోమీటర్ల దూరంలో ఉన్న లఖింపూర్ జిల్లాలో చెలరేగిన హింసాకాండపై యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గత మూడు రోజులుగా టార్గెట్ చేశాయి.

argbe minఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోవడం తీవ్ర దుమారానికి కారణమయ్యింది. ఈ దారుణ ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా హస్తం ఉందని.. అతన్ని అరెస్ట్ చేయడాలని డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రియాంకా వాద్రా(49) సోమవారం యుపి జిల్లాకు వెళ్తున్నప్పుడు ఆమెను అరెస్టు చేసినట్లు చెప్పారు.

prgai minఎటువంటి ఆదేశం లేకుండా ప్రతిపక్షాలను అరెస్ట్‌ చేస్తున్నారు.. కానీ భయంకర నేరానికి పాల్పడిన కేంద్ర మంత్రి కుమారుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ప్రశ్నించారు. వెంటనే అలాంటి నిందితులను అరెస్ట్‌ చేయాలని.. తమలాంటివారిని కాదంటూ హితవు పలికారు. తాజాగా ప్రియాంక గాంధీ అరెస్ట్ పై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో నిరసనలు.. విమర్శలు చేస్తున్నారు.