ఈ విశాల విశ్వంలో భూమి ఓ చిన్న గ్రహం.. విశ్వ విస్తీర్ణంతో.. భూమిని పోల్చితే.. చిన్న ధూళి కణంతో సమానం అంటారు. అంటే విశ్వం అనంత దూరాలకు వ్యాపించి ఉందని అర్థం. ఇక భూమీ మీద మనుషులు ఉన్నట్లుగానే.. ఈ విశ్వంలో ఇతర గ్రహాల మీద బుద్ధి జీవులు ఉన్నాయా అనే అంశం మీద ఎన్నోఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు ఎలియన్స్‌కి సంబంధించని వార్తలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మన దేశం, గుజరాత్‌లో వెలుగు చూసిన ఓ సంఘటన అంతరిక్ష వాసులు ఉన్నారనే ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. మరి ఆ సంఘటన ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే. గుజరాత్‌లోని పలు గ్రామాల్లో గత మూడు రోజులుగా పంట పొలాల్లో వెండి రంగులో ఉన్న లోహపు బంతులు పడుతున్నాయి. వాటిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అవేంటో తెలియక.. దీనికి కారణం ఏమై ఉంటుందో అర్థం కాక భయాందోళనలకు గురి అవుతున్నారు. గుజరాత్‌లో సురేంద్ర నగర్ జిల్లా సైలా గ్రామంలోని పంటపొలాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న వింత వస్తువులను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. గత మూడు రోజులుగా నలుపు, సిల్వర్ రంగులో ఉన్న మెటల్ బాల్స్ ఆకాశం నుంచి పంటపొలాల్లో పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఖేడా జిల్లాలోని ఉమ్రేత్, నాడియాడ్ గ్రామాలతోపాటు ఆనంద్ జిల్లాలోని మూడు గ్రామాలలో కూడా ఇలాంటి మెటల్ బాల్స్ దర్శనం ఇచ్చాయి. ఇది కూడా చదవండి: Gujarat: మరికొన్ని గంటల్లో పెళ్లి.. డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ వరుడు మృతి! మే 12న ఆనంద్ జిల్లాలోని భలేజ్, ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో కూడా ఆకాశం నుంచి ఈ మిస్టరీ బంతుల శకలాలు రాలి పడ్డాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. భలేజ్ ప్రాంతంలో గురువారం (మే 12,2022) సాయంత్రం 4.45 గంటలకు ఐదు కేజీల బరువున్న నల్ల రంగులోని మెటల్ బాల్ పడింది. ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో కూడా ఇలాంటివి ఆకాశం నుంచి ఊడి పడ్డాయి. ఈ మూడు గ్రామాలు 15 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ఇలా మెటల్ బాల్స్ పడటంతో ఆందోళన చెందిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసలు ఆ ప్రాంతాలకు తరలివచ్చి వాటిని పరిశీలించారు. బహుశా అవి శాటిలైట్ వ్యర్థాలు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలపై ఆనంద్ జిల్లా ఎస్పీ అజిత్ రాజియన్ మాట్లాడుతూ.. ఇవి మెట్ బాల్స్‌లా ఉన్నాయని.. కానీ వీటి వల్ల ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని తెలిపారు. ఖంభోల్జ్ లో ఒక ఇంటికి సమీపంలో, మరో రెండు చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఆకాశం నుంచి లోహపు బంతులు పడినట్లుగా గుర్తించామని తెలిపారు. ఈ మిస్టరీ బాల్స్ పై దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులను పిలిపించామని వెల్లడించారు. 'It's a bird. It's a plane...': Mysterious metal balls raining in Gujarat puzzles locals pic.twitter.com/RGKEpPQyoO — Times No1 (@no1_times) May 16, 2022 ఇది కూడా చదవండి: Gujarat: బంగారం లాంటి భర్త! కానీ.., పుట్టింటి మీద ప్రేమతో భార్య చేసిన దారుణం ఇది! మరోవైపు గుజరాత్‌లోని మూడు జిల్లాల్లో ఆకాశం నుంచి రాలిపడుతున్న అంతరిక్ష వ్యర్థాలను పరిశీలించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నిపుణుల రంగంలోకి దిగారు. దేశ అంతరిక్ష డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఈ ప్రభుత్వ లాబొరేటరీ, స్పేస్ సైన్స్‌పై పరిశోధనలు చేస్తుంది. మొదట్లో ఆ వస్తువులు ఏమిటో తమకు తెలియదని, మూడు ప్రదేశాలలో జనం గుమిగూడారని, అయితే అవి గురుత్వాకర్షణ శక్తి లేని సమయంలో అంతరిక్షంలో ఉపగ్రహం వేగాన్ని కొనసాగించడానికి ఉపయోగించే బాల్ బేరింగ్‌లుగా అనిపించిందని ఎస్పీ రాజయాన్ చెప్పారు. Meteorite Or An Alien? Mysterious Metal Balls Fall From Space Video Goes Viral https://t.co/U3dhPxmofB — Trends302 (@Trends_302) May 13, 2022 ఇది కూడా చదవండి: Gujarat: 31 పైసలు బాకీ కోసం రైతును కోర్టుకు లాగిన SBI Bank! మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.