ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరి తీసిన మావోయిస్టులు

Mavoyist Shoot a Normal Peoples - Suman TV

బిహార్‌లోని దుమారియా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నలుగురు మావోయిస్టులు ఉరితీశారు. పోలీసులకు సమాచారం అందిస్తున్నారనే నెపంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ప్రజాకోర్టు నిర్వహించి ఉరి తీశారు. ఆ కుటుంబంలోని అన్నదమ్ములను, వారి భార్యలను మావోయిస్టులు తాళ్లతో కట్టేసి, కళ్లకు గంతలు కట్టి ఇంటి వెనక ఉరి తీశారు. అనంతరం ఇంటిని డిటొటినేటర్లతో పేల్చేశారు.

ఇంటి యాజమాని సరయు సింగ్ భోక్తా ఆ సమయంలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గతంలో పోలీసుల నలుగురు మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేశారు. వారి మరణానికి వీరే కారణమని, గతంలో జరిగింది ఎన్ కౌంటర్ కాదు. నలుగురు మావోయిస్టులకు అన్నంలో విషం పెట్టి, ఆ తరువాత పోలీసులకు సమాచరం ఇచ్చి స్పృహలోలేని నలుగురిని కాల్చారంటూ ఘటన స్థలంలో వదిలిన లేఖలో మవొయిస్టులు పెర్కొన్నారు.