బీహార్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బీహార్ రాకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. 1996లో బీహార్‌లో బయటపడిన రూ. 950 కోట్ల పశుగ్రాస కుంభకోణములో లాలూతో పాటు ఇతర ముఖ్య ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన స్థానములో సతీమణి రాబ్డీ దేవిని ముఖ్యమంత్రిగా నియమించాడు. ఇదిలా ఉంటే.. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ సతీమణ రబ్రీ దేవీ ఆర్జేడీ పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. ఏకంగా కార్యకర్తలపై చేయి చేసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
వివరాల్లోకి వెళితే.. లాలూ ప్రసాద్ యాదవ్ 2004-09 మధ్య కాలంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాల్లో లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తాజాగా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పట్నాలోని ఆయన నివాసంపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. లాలూ సతీమణి రబ్రీ దేవి ఇల్లు సహా దిల్లీ, బిహార్లో లాలూకు చెందిన మొత్తం 17 చోట్ల తనిఖీలు నిర్వహించారు. అయితే సీబీఐ చర్యలను ఆర్జేడీ నాయకులు విమర్శిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కావాలనే తమ నేతను టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Lucknow: 10 రోజులుగా తల్లి మృతదేహంతోనే కూతురు.. అక్కడ సీన్ చూసి పోలీసులు షాక్!
తనిఖీలు ముగించుకొని సీబీఐ అధికారులు లాలూ ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆర్జేడీ కార్యకర్తలు కొంతమంది బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో అధికారులను వెల్లనివ్వండీ అంటూ కార్యకర్తలకు రబ్రీదేవి సూచించారు. అయినా కూడా కార్యకర్తలు ఆందోళన ఉధృతం చేయడంతో వారిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
CBI हाय-हाय के नारे लगा रहे थे RJD कार्यकर्ता, गुस्से में आकर Rabri Devi ने जड़ दिया थप्पड़https://t.co/WjldWg4WnR pic.twitter.com/AACFZqGYBj
— देवेन्द्र कश्यप (@idevendraji) May 20, 2022