మొట్టమొదటి డిస్ట్రాయర్‌ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ మహాభినిష్క్రమణం ఈనాడే!..

భారత్‌ నౌకాదళంలో గొప్పశకం ముగియనుంది. భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి డిస్ట్రాయర్‌ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ ఇకపై విశ్రాంతి తీసుకోనుంది. 41 ఏళ్ల పాటు సేవలందించిన ఐఎన్‌ఎస్‌ రాజుపుత్‌ తన సుదీర్ఘ ప్రస్థానానికి శుక్రవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు రక్షణ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ అపూర్వ ఘట్టానికి విశాఖపట్టణంలోని నావల్‌ డాక్‌యార్డ్‌ వేదిక కానుంది. ఈ యుద్ధనౌకను ఒకప్పటి సోవియట్ యూనియన్‌ నిర్మించింది. 4 మే 1980న జార్జియాలోని పోటిలో యూఎస్ఎస్ఆర్‌లో అప్పటి భారత రాయబారి ఐకే గుజ్రాల్.. కెప్టెన్ గులాబ్ మోహన్‌లాల్ హీరానందనితో కలిసి దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో విలువైన సేవలను అందించింది. ఈ యుద్ధనౌకకు తొలి కమాండింగ్ ఆఫీసర్‌గా కెప్టెన్‌ గులాబ్‌ మోహన్‌లాల్‌ హీరారందానీ వ్యవహరించారు.86959b87eb132d646c9349840c56599cకొవిడ్‌ నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ కొద్ది మంది సిబ్బంది సమక్షంలో విరమణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌కు గులాబ్ తొలి కమాండింగ్ అధికారి. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఇది దేశానికి ఎనలేని సేవలు చేసింది. దేశాన్ని భద్రంగా ఉంచడంలో ఈ నౌక ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. ఐపికెఎఫ్‌కు సహాయపడటానికి ఆపరేషన్‌, అండమాన్‌ – శ్రీలంక తీరంలో పెట్రోలింగ్‌ విధుల కోసం ఆపరేషన్‌ పవన్‌, మాల్దీవుల నుండి తాకట్టు పరిస్థితిని పరిష్కరించడానికి ఆపరేషన్‌ కాక్టస్‌, లక్షద్వీప్‌ నుండి ఆపరేషన్‌ క్రోవ్‌నెస్ట్‌ వీటిలో కీలకమైనవి. రాజ్‌పుత్‌లో విధులు నిర్వర్తించిన పలువురు అధికారుల్ని సత్కరించేందుకు తూర్పు నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసింది.