విషాదం : ఇల్లు కూలి 9 మంది నిద్రలోనే కన్నుమూశారు!

గత కొన్ని రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమిళనాడులోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, కడలూరులో అతిభారీ వర్షాలు ఆస్తి నష్టం..ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. తమిళనాడులో కురుస్తున్న వర్షాల కారణంగా వేలూరులోని పెర్నంబుట్‌లో ఇల్లు కూలిపోవడంతో తొమ్మిది మంది నిద్రలోనే మరణించారు. క్షతగాత్రులను రక్షించామని తెలిపారు కలెక్టర్‌ టీపీ కుమారవేల్‌ పాండియన్‌.

fag compressedఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మంది కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తామని తెలిపారు. తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

rjeg compressedభారీ వర్షాల కారణంగా స్కూళ్లు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గత వారం తమిళనాడులో భారీ వర్షాలకు 10 మందికి పైగా మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన పంటలు నీట మునిగాయి, చెట్లు నేలకూలాయి. 1000 కి పైగా గుడిసెలు దెబ్బతిన్నాయి.