ఎలాంటి దుస్తులు ధరించాలో వారి వ్యక్తిగత అభిప్రాయం.. ఈ విషయంలో మీ జోక్యం ఏంటీ?

Bindu Kerala Education minister kerala

ఇటీవల కాలంలో తమిళనాడులోని విద్యాసంస్థల్లో మహిళా టీచర్ల వస్త్రలంకరణపై వివాదం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. అయితే ఈ విషయంపై తమిళనాడు సర్కార్ కూడా తప్పనిసరికాదంటూ గతంలో అనేకసార్లు వివరణ కూడా ఇచ్చింది. అయితే ఈ క్రమంలోనే మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మహిళా ఉపాధ్యాయులంతా విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు దృష్టికి తీసుకెళ్లారు.

అయితే దీనిపై స్పందించిన మంత్రి బిందు కేరళ ప్రగతిశీల వైఖరికి ఏ మాత్రం సమంజసంగా లేదంటూ సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వినిపించిన మంత్రి బిందు.. ఉపాధ్యాయులు ఎలాంటి వస్తువులు ధరించాలనేది వారి వ్యక్తిగతమైన అభిప్రాయమని ఈ విషయంలో మీ ఒత్తిడి ఏంటంటూ విద్యాసంస్థల యాజమాన్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒకరి దుస్తువుల ఎంపిక అనేది వారి వ్యక్తిగత విషయమని ఆ విషయంలో విమర్శించే హక్కు ఎవరీకి కూడా లేదంటూ మంత్రి బిందు తెలిపింది. ఇక రాష్ట్రంలో అనేక విద్యాసంస్థలు ఇలాంటి పద్దతులను మానుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.