హుజూరాబాద్‌, బద్వేల్‌ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

elections

దేశంలో ఖాళీగాఉన్నన పార్లమెంట్‌, శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 3 పార్లమెంట్‌, 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని హుజూరాబాద్‌, ఏపీలోని బద్వేల్‌ శాసనసభ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. హుజూరాబాద్‌, బద్వేల్‌ శాసనసభ స్థానాలకు అక్టోబర్‌ 30న ఎన్నికల పోలింగ్.. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. షెడ్యూల్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

  • అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల.
  • నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8.
  • అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.
  • అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.
  • నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.

తెలంగాణలోని హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన ఈటల రాజేందర్‌ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ ఉపఎన్నికలు వచ్చాయి. బద్వేలులో వైకాపా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడంతో ఆస్థానానికి ఖాళీ ఏర్పడింది.